చంద్రబాబు అడ్డా కుప్పం గడ్డా అడ్డం తిరిగిందే: లోకేష్ ఆ పని చేస్తానంటున్నారా?

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (19:58 IST)
ఎపిలో అన్ని మున్సిపాలిటీల ఫలితాలు ఒక ఎత్తయితే కుప్పం మున్సిపాలిటీ గెలుపు మరొక ఎత్తు. అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు గెలుపు కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. 

 
కుప్పం కంచుకోటలో టిడిపి జెండాను ఎగురవేస్తామని ఆ పార్టీ అభ్యర్థులు చెబితే కాదు వైసిపి జెండా ఎగురుతుందని చెప్పారు. చివరకు ఫలితాల్లో వైసిపికే అనుకూలంగా వచ్చాయి.

 
వైసిపికి 19, టిడిపికి ఆరు స్థానాలు వచ్చాయి. అయితే ఎన్నికలకు ముందు ప్రచారం నిర్వహించారు చంద్రబాబు, నారా లోకేష్. లోకేష్ పర్యటనలో మాత్రం చంద్రబాబు అడ్డా కుప్పం గడ్డా అంటూ భారీ డైలాగులు చెప్పారు. ఇది కాస్త పెద్ద చర్చకు దారి తీసింది.

 
లోకేష్ పర్యటన తరువాత టిడిపి నేతల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ప్రజలందరూ టిడిపి వైపే ఉన్నారని అందరూ భావించారు. కానీ అంతా రివర్స్ అయ్యింది. కుప్పంలో ఘోర పరాజయం ఎదురైంది.

 
దీంతో ఓటమిని చాలా సీరియస్‌గా తీసుకున్నారట లోకేష్. టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయాలని అనుకుంటున్నారట. నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయడమే మంచిదన్న నిర్ణయంలో ఉన్నారట లోకేష్. 

 
అయితే పార్టీ సీనియర్ నేతలు మాత్రం అది సరైంది కాదంటున్నారట. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమేనని.. దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారట. దీంతో లోకేష్ కూడా ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tollywood Exibitors war : ఎగ్జిబిటర్ల మధ్య వార్ - దిల్ రాజు మనుషులు బెదిరింపు !

Shruti Haasan: గ్రామస్తుల వింత పరిస్థితికి సింగ్ గీతం నుంచి ఏమైంది' సాంగ్

పోలీస్ కంప్లైంట్ లో కృష్ణ సినిమాల‌ను గుర్తు చేస్తూ ప్ర‌త్యేక‌ పాట‌

Charan: జీవితాంతం దాచుకునే సినిమాల్లో పెద్ది ఒకటి : రామ్ చరణ్

Allu Aravind : అల్లు రామలింగయ్య పేరిట గది నిర్మాణానికి అల్లు అరవింద్ విరాళం

తర్వాతి కథనం
Show comments