మర్కజ్ భవనం శుద్ధి.... 617 మందిలో కరోనా లక్షణాలు

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (19:22 IST)
ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ భవనంలో ఉన్న ముస్లిం మతపెద్దలను ఖాళీ చేయించి, ఆ ప్రాంతాన్ని శుద్ధి చేశారు. ఈ భవనం నుంచి మొత్తం 2361 మందిని క్వారంటైన్‌కు తరలించారు. వీరిలో 617 మందికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు సమాచారం. ఈ విషయాన్ని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. 
 
ఈ మర్కజ్ మసీదు వేదికగా ఇటీవల మతపరమైన ప్రార్థనలు జరిగాయి. ఇక్కడు కరోనా బాధిత దేశాల నుంచి అనేక మంది ప్రతినిధులు వచ్చారు. ఈ సదస్సుకు హాజరై తమతమ ప్రాంతాలకు తిరిగివెళ్లిన వారి నుంచే ఈ వైరస్ దేశ వ్యాప్తంగా వ్యాపించింది. దీంతో ఈ మర్కజ్ మసీదును పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 
 
పైగా, ఇక్కడ ఉన్న వారందరినీ ఖాళీ చేయించి వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఈ తరలింపు కార్యక్రమం ఏకంగా 36 గంటల పాటు సాగింది. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న వారందరికీ మనీష్‌ సిపోడియా కృతజ్ఞతలు తెలిపారు. 
 
ఇకపోతే, ఢిల్లీలోని మర్కజ్‌ భవన్‌తో పాటు పరిసర ప్రాంతాలను సౌత్‌ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సిబ్బంది శానిటైజేషన్‌ చేస్తున్నారు. మర్కజ్‌ భవన్‌లో మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు జరిగిన మత ప్రార్థనల్లో ఇతర దేశాలకు చెందిన వారితో పాటు మన దేశానికి చెందిన పలువురు ముస్లింలు పాల్గొన్నారు. ఈ ప్రార్థనల్లో సుమారు 3 వేల మందికి పైగా పాల్గొన్నారు. వీరిలో పెక్కు మందికి ఈ వైరస్ సోకింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Sneha Reddy,: ఆటోపై అల్లు అర్జున్ పేరును చూపించడం గర్వకారణం : అల్లు స్నేహ రెడ్డి

Mani Ratnam: తు యా మైన్ చిత్రంపై మణిరత్నం ప్రశంసల జల్లు

Shivani Nagaram: కాత్యాయని పాట ఎందుకు హిట్ అయిందో తెలిదు :శివాని నాగరం

Ramcharan: ఎగస్ పార్టీ కి దూల తీసి దూపం ఏసేవాడే పెద్ది !

రీసెంట్‌గా వచ్చిన చిత్రంలోలాగా మా చిత్రంలో ఏఐ ఉపయోగించలేదు : నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

Pink salt : పింక్ సాల్ట్ ఆరోగ్య ప్రయోజనాలు.. ఇందులో అయోడిన్ ఉండదు

Valentines Day: వాలెంటైన్స్ డే.. ఎర్ర గులాబీల ఔచిత్యం.. సెయింట్ వాలెంటైన్ గౌరవార్థం..

అల్లంతో కండరాల నొప్పి, బహిష్టు నొప్పి తగ్గుతుంది

తర్వాతి కథనం
Show comments