Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సమయంలోనే బాణాసంచా కాల్చాలి... అమ్మకాలపై సుప్రీం కోర్టు కొరఢా

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (11:37 IST)
దీపావళి పండుగను పురస్కరించుకుని ఆన్‌లైన్ టపాకాయల విక్రయాలపై సుప్రీంకోర్టు కొరఢా ఝుళిపించింది. ఆన్‌లైన్‌ విక్రయాలపై కోర్టు నిషేధం విధించింది. అదేసమయంలో దేశంలో బాణాసంచా విక్రయాలపై పూర్తి స్థాయి నిషేధం విధించలేమని తేల్చిచెప్పింది. కానీ పటాకుల విక్రయాలపై కొన్ని షరతులను మాత్రం పాటించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
 
కాలుష్యం కోరల నుంచి పర్యావరణాన్ని పరిరక్షించాలని, ఇందులోభాగంగా, టాపాకాయల విక్రయాలపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్‌భూషణ్‌ల నేతృత్వంలోని ధర్మాసనం ఆగస్టు 28వ తేదీన విచారణ జరిపి తీర్పును రిజర్వులో ఉంచుంది. ఆ తీర్పు మంగళవారం వెలువరించింది. 
 
ఈ కామర్స్ పోర్టల్స్ ఏవీకూడా ఆన్‌లైన్‌లో పటాకులను అమ్మరాదు అని కోర్టు తీర్పునిచ్చింది. దీపావ‌ళి రోజున రాత్రి 8 నుంచి 10 గంట‌ల వ‌ర‌కే ప‌టాకులు కాల్చాల‌ని, ఇక క్రిస్మ‌స్‌, న్యూఇయ‌ర్‌ రోజుల్లో మాత్రం రాత్రి 11.45 నిమిషాల నుంచి అర్థ‌రాత్రి 12.45 వ‌ర‌కు ప‌టాకుల‌ను కాల్చుకోవ‌చ్చు అని కోర్టు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

ఆయన వల్లే బాలక్రిష్ణ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కు ఛాన్స్ వచ్చిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తర్వాతి కథనం
Show comments