Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాకప్‌‌లో వేసి బట్టూడదీసి, నోటిలో మూత్రం పోసారు.. విలేకరికి చేదు అనుభవం (వీడియో)

Webdunia
బుధవారం, 12 జూన్ 2019 (10:39 IST)
యూపీలో పాత్రికేయులపై దారుణాలు జరుగుతున్నాయి. వీటిపై యోగి సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఫలితంగా పాత్రికేయులపై ఆగడాలు ఏమాత్రం ఆగట్లేదు. ఇప్పటికే యూపీ సర్కారు జర్నలిస్టులపై కేసులు పెడుతున్న వేళ.. తాజాగా పాత్రికేయునికి నీచమైన అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఈ ఘటనను దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. 
 
రైలులో జరుగుతున్న అనధికారిక వ్యాపారులపై ఓ కథనాన్ని చిత్రీకరించేందుకు వచ్చిన విలేకరిపై రైల్వే పోలీసు ఇనస్పెక్టర్ రాకేశ్ కుమార్ హద్దు మీరి ప్రవర్తించాడు. అమిత్‌ శర్మ అనే విలేకరిపై రాకేశ్ దాడి చేశాడు. తీవ్రంగా కొట్టాడు. కానీ ఈ దృశ్యాలు వీడియోలో రికార్డు అయ్యాయి. ఇంకా ఆ విలేకరిని అరెస్ట్ చేశారు. 
 
ఈ ఘటనపై బాధితుడైన విలేకరి మాట్లాడుతూ.. దాడి చేయడమే కాకుండా నీచానికి ఒడిగట్టారని ఆరోపించాడు. ఇంకా దారుణంగా కొట్టారని, కెమెరాను ధ్వంసం చేశారన్నాడు. అంతటితో ఆగకుండా స్టేషన్‌కు తీసుకెళ్లి, లాకప్‌‌లో వేసి బట్టూడదీసి, నోటిలో మూత్రం పోసారని ఆయన ఆరోపించారు. ఈ వీడియో వైరల్‌ కావడంతో స్పందించిన రైల్వే అధికారులు, ఘటనకు బాధ్యుడైన రాకేశ్‌ను, మరో  రైల్వే కానిస్టేబుల్‌‌ను విధుల నుంచి తొలగిస్తూ, ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments