Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వికలాంగ బాలుడు అంగానికి ఇటుకను తాడుతో కట్టి వేలాడదీశారు...

Advertiesment
వికలాంగ బాలుడు అంగానికి ఇటుకను తాడుతో కట్టి వేలాడదీశారు...
, బుధవారం, 29 మే 2019 (14:46 IST)
బీజేపీ పాలిత రాష్టమైన ఉత్తరప్రదేశ్‌లో దారుణాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఓ మానసిక బాలుడు తెలియక చేసిన పనికి అతడి అంగానికి తాడుతో కట్టిన ఇటుకను వేలాడదీశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించి బాలుడు కుటుంబ సభ్యులపైనా దాడి జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీలోని షాజన్‌పూర్ ప్రాంతానికి చెందిన 16 యేళ్ల బాలుడు చిన్నవయసు నుంచి మానసిక వికలాంగుడుగా ఉన్నాడు. ఈ నెల 26వ తేదీన తమ ఏరియాకు చెందిన కొంతమంది పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో మిగిలిన యువకులతో చిన్నవాటి వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన మిగిలిన పిల్లలు ఆ మానసిక బాలుడుపై దాడి చేసి గాయపరిచారు. 
 
ఆ తర్వాత ఇటుకను తాడుకు కట్టి దాన్ని అతని అంగాన్ని కట్టారు. పిమ్మట వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలుడు తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా, వారిపై కూడా దాడి చేశారు. ఈ విషయం పోలీసులకు చేరడంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. కేసు నమోదు చేసి అల్లరి మూకను అరెస్టు చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలంరేపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎంబీబీఎస్ విద్యార్థి పిరుదులు నొక్కిన డ్యూటీ డాక్టర్...