Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీకి కౌంటరిచ్చిన శ్రీరెడ్డి... లాంగ్‌ డ్రైవ్‌లో కారునే పడకగదిగా మార్చేస్తున్నారు..

శ్రీరెడ్డి తమిళ్ లీక్స్ మొదలు పెట్టడంతో కోలీవుడ్ ప్రముఖుల్లో వణుకు మొదలైంది. శ్రీరెడ్డి ఇప్పటికే రాఘవ లారెన్స్, మురుగదాస్, సందీప్ కిషన్, త్రిష, నయనతార వంటి ప్రముఖుల పేర్లు ప్రస్తావిస్తున్న సంగతి తెలిస

Webdunia
ఆదివారం, 22 జులై 2018 (16:52 IST)
శ్రీరెడ్డి తమిళ్ లీక్స్ మొదలు పెట్టడంతో కోలీవుడ్ ప్రముఖుల్లో వణుకు మొదలైంది. శ్రీరెడ్డి ఇప్పటికే రాఘవ లారెన్స్, మురుగదాస్, సందీప్ కిషన్, త్రిష, నయనతార వంటి ప్రముఖుల పేర్లు ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లీక్స్ అంటూ చెన్నైలో మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తోంది.
 
తాజాగా... శ్రీరెడ్డి చిక్కులు నడిగర్ సంఘం వరకు చేరాయి. నడిగర్ సంఘం కోశాధికారిగా పనిచేస్తున్న హీరో కార్తీ.. ఆధారాలు లేకుండా శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలేంటని ప్రశ్నించారు. ఆమెపై ఫిర్యాదు చేస్తే.. అప్పుడు విచారణ జరుపుతామన్నారు. 
 
దీనిపై శ్రీరెడ్డి స్పందిస్తూ.. తనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. లేకపోతే తానేంటో చూపించాల్సి వస్తుంది. లాజిక్కులు మాట్లాడొద్దు కార్తీ సార్ అంటూ కౌంటర్ఇచ్చింది. నడిగర్ సంఘం ఉన్నది సమస్యలు తీర్చడానికి.. ఉచిత సలహాలు ఇవ్వడానికి కాదు అంటూ శ్రీరెడ్డి కార్తీ పై ఫైర్ అయింది. 
 
మరోవైపు దర్శకనిర్మాతలు అవకాశాల పేరిట హీరోయిన్లను తెగ వాడేసుకుంటున్నారని శ్రీరెడ్డి ఆరోపించింది. నటులు, నిర్మాతలు హీరోయిన్లను లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తున్నారని.. అలా కారులోనే పనికానిచ్చేస్తున్నారని.. కారునే పడకగదిగా మార్చేస్తున్నారని, హీరోయిన్లతో ఉల్లాసంగా వుంటున్నారని విమర్శలు గుప్పించింది. 
 
కొన్ని సందర్భాల్లో ఓ పాట కోసమంటూ విదేశాల్లో షూటింగ్‌కు తీసుకెళ్ళి.. హీరోయిన్లపై తమ వాంఛను తీర్చుకుంటున్నారని శ్రీరెడ్డి చెప్పింది. దర్శకనిర్మాతలే కాకుండా మేనేజర్, కెమెరామేన్, మేకప్ మ్యాన్‌లను కూడా హీరోయిన్లు కాంప్రమైజ్ చేయాలని తెలిపింది. తమిళ సినీ రంగానికి చెందిన పలువురు నటీమణులతో ఉల్లాసంగా గడిపేందుకు హైదరాబాదునే ఎంచుకుంటున్నారని శ్రీరెడ్డి బాంబు పేల్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments