Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్ఎక్స్-100లో కిస్ సీన్లను రిపీట్ చేశాం.. కానీ వన్ మోర్ చేయలేదు: పాయల్

ఆర్ఎక్స్-100లో అందాలను ఆరబోసిన పాయల్ రాజ్ పుత్ అప్పుడే ప్రేమలో పడిందా అంటే.. అవుననే సమాధానమే వస్తోంది. లేటెస్ట్ హాట్ హిట్ 'ఆర్ఎక్స్ 100'తో రాత్రికి రాత్రే టాలీవుడ్‌లో స్టార్ అయిపోయిన పాయల్ రాజ్ పుత్

Advertiesment
Actress
, ఆదివారం, 22 జులై 2018 (10:45 IST)
ఆర్ఎక్స్-100లో అందాలను ఆరబోసిన పాయల్ రాజ్ పుత్ అప్పుడే ప్రేమలో పడిందా అంటే.. అవుననే సమాధానమే వస్తోంది. లేటెస్ట్ హాట్ హిట్  'ఆర్ఎక్స్ 100'తో రాత్రికి రాత్రే టాలీవుడ్‌లో స్టార్ అయిపోయిన పాయల్ రాజ్ పుత్ కొంతకాలంగా నాన్ వెజ్ తినడం మానేసిందట. ఎందుకంటే..  ''తను'' తన జీవితంలోకి వచ్చాక మాంసాహారం తీసుకోవడం మానేశానని పాయల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 
 
అయితే ఆ 'తను' అన్నది ఎవరన్న విషయాన్ని మాత్రం ఇప్పుడు చెప్పబోనని తెగేసి చెప్పింది ఈ పంజాబీ భామ. ప్రస్తుతానికి నటనపై ఫోకస్ చేస్తున్నానని, టాలీవుడ్‌లో ప్రిన్స్ మహేష్ బాబు సరసన నటించాలనుందని.. తెలుగులోనే సెటిల్ పోవాలనే ఆలోచనలో వున్నానని పాయల్ చెప్పుకొచ్చింది. అక్టోబర్‌లో కొత్త ప్రాజెక్టు వుంటుంది. ఇక్కడి అమ్మాయిలు చాలా సింపుల్ గా ఉంటారని, తమ ప్రాంతంలో ఇలాంటి వాళ్లను చూడలేమని చెప్పింది. 
 
'ఆర్ఎక్స్ 100'లో హాట్ కిస్ సీన్స్ గురించి ప్రస్తావిస్తూ, తొలుత ముద్దు దృశ్యాలకు భయపడ్డానని, అయితే, హీరో కార్తికేయ చాలా ప్రొఫెషనల్ కావడంతో, తాను సౌకర్యంగా ఫీల్ అయ్యానని, తమ మధ్య సన్నివేశాలు కేవలం నటన మాత్రమేనని స్పష్టం చేసింది. రెండు మూడు యాంగిల్స్‌లో సీన్ రావడం కోసం కిస్ సీన్లను రిపీట్ చేశామే తప్ప, వన్ మోర్ షాట్ అన్న మాటే దర్శకుడి నుంచి రాలేదని పాయల్ తెలిపింది.
 
ఇక హీరో కార్తీక్ చాలా మంచి హ్యూమన్ బీయింగ్. తనతో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్‌గా వుంది. తాను మంచి గ్రేస్ వున్న నటుడు. వర్క్ పట్ల డెడికేషన్ అండ్ హార్డ్ వర్కర్ కూడా. మా ఇద్దరి స్క్రీన్ కెమిస్ట్రీ బాగా కుదిరిందని తాను అనుకుంటున్నానని పాయల్ చెప్పింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా పెళ్లి అలా జరగాలనే కోరుకుంటా: నిహారిక