Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ఆర్ఎక్స్ 100'కు అడ్డుకట్ట వేసేదెవరు?

ఇటీవలికాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి వసూళ్లు సాధిస్తున్న చిత్రం "ఆర్ఎక్స్ 100". అంతా కొత్తవాళ్ళతోనే వచ్చిన ఈ సినిమా విడుదలైన 8 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ.8 కోట్ల రూపాయలకుపైగా షేర్ సాధ

Advertiesment
'ఆర్ఎక్స్ 100'కు అడ్డుకట్ట వేసేదెవరు?
, శనివారం, 21 జులై 2018 (09:16 IST)
ఇటీవలికాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి వసూళ్లు సాధిస్తున్న చిత్రం "ఆర్ఎక్స్ 100". అంతా కొత్తవాళ్ళతోనే వచ్చిన ఈ సినిమా విడుదలైన 8 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ.8 కోట్ల రూపాయలకుపైగా షేర్ సాధించింది. ఇప్పటికి వసూళ్లు నిలకడగా ఉన్నాయి. ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ అందాలకు యూత్ ఫిదా అయిపోయారు. ఫలితంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనవర్షం కురిపిస్తోంది.
 
జూలై 14వ తేదీన ఈ చిత్రం విడుదలైంది. ఆ తర్వాత ఈ శుక్రవారం (జూలై 20వ తేదీ)న మరో మూడు చిత్రాలు విడుదలయ్యాయి. ఈ మూడింటిలో దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన "లవర్" సినిమాపై అంచనాలు ఉన్నాయి. పెద్ద బ్యానర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఓపెనింగ్ కలెక్షన్లు బాగుంటాయని అనుకున్నారు. కానీ ఈ చిత్రం కూడా ఆశించినంతగా లేకపోవడంతో థియేటర్స్ వద్ద ప్రేక్షకుల సందడి కనిపించడం లేదు. 
 
ఇకపోతే, "ఆటగదురా శివ" సినిమా హృదయానికి హత్తుకునే విధంగా ఉన్నా.. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చదు. సెంటిమెంట్, ఫిలాసఫీ నచ్చే వారు మాత్రమే ఈ చిత్రాన్ని ఆదరిస్తారు. కాబట్టి ఆ సినిమా "ఆర్‌ఎక్స్ 100"కు పెద్ద పోటీకానేకాదని ఘంటాపథంగా చెప్పొచ్చు. థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన "వైఫ్ ఆఫ్ రామ్" సినిమా కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపిస్తోంది. 
 
ఈ సినిమా కూడా "ఆర్ఎక్స్ 100"కు పోటీ ఇస్తుందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. మొత్తమీద పోటీకు పోటీగా ఉంటాయని అనుకున్న సినిమాలు పెద్దగా విజయవంతం కాకపోవడంతో 'ఆర్ఎక్స్ 100' జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోందని చెప్పొచ్చు. వచ్చేవారం వరకు 'ఆర్ఎక్స్ 100' కలెక్షన్లకు ఢోకా లేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజమౌళితో సినిమా చేయనంటున్న సమంత.. ఎందుకంటే?