Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూలై 15-07-2018 నుండి 21-07-2018 వరకు మీ వార రాశి ఫలితాలు(Video)

మిధునంలో రవి, కర్కాటకంలో బుధ, రాహువులు, సింహంలో శుక్రుడు, తులలో బృహస్పతి, ధనస్సులో వక్రి శని, మకరంలో వక్రి కుజ, కేతువులు. కర్కాటక, సింహ, కన్య, తులల్లో చంద్రుడు. 16న రవి కర్కాటక ప్రవేశం. ముఖ్యమైన పనులకు సప్తమి, గురువారం శుభదాయకం.

Advertiesment
జూలై 15-07-2018 నుండి 21-07-2018 వరకు మీ వార రాశి ఫలితాలు(Video)
, శనివారం, 14 జులై 2018 (15:51 IST)
మిధునంలో రవి, కర్కాటకంలో బుధ, రాహువులు, సింహంలో శుక్రుడు, తులలో బృహస్పతి, ధనస్సులో వక్రి శని, మకరంలో వక్రి కుజ, కేతువులు. కర్కాటక, సింహ, కన్య, తులల్లో చంద్రుడు. 16న రవి కర్కాటక ప్రవేశం. ముఖ్యమైన పనులకు సప్తమి, గురువారం శుభదాయకం.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. సంతానం ఉన్నత చదువులపై మరింత శ్రద్ధ అవసరం. విద్యా ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. కొత్త పరిచయాలేర్పడతాయి. ఓర్పుతో వ్యవహరించాలి. తొందరపాటు తగదు. పెద్దల సలహా పాటించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. అదనపు రాబడిపై దృష్టి పెడతారు. పనులు సావకాశంగా పూర్తిచేస్తారు. గురు, శుక్ర వారాల్లో అపరిచితులతో జాగ్రత్త. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. పెట్టుబడులకు సమయం కాదు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు సమస్యలెదురవుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం. నిర్మాణాలు, మరమ్మత్తులు మందకొడిగా సాగుతాయి. కంప్యూటర్ రంగాలవారికి ఆశాజనకం. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. కొంత మెుత్తం సాయం చేయండి. ఎవరినీ నొప్పించవద్దు. పనులు హడావుడిగా సాగుతాయి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నిర్ధిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. శనివారం నాడు విలువైన వస్తువులు నగదు జాగ్రత్త. బంధువులతో విభేదిస్తారు. ఆరోగ్యం సంతృప్తికరం. గృహమార్పు కలిసివస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. సహోద్యోగులు సహకరిస్తారు. అధికారులకు హోదా మార్పు. వ్యాపారాల్లో ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయ. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. 
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఈ వారం అన్ని రంగాల వారికి బాగుంటుంది. పరిస్థితులు చక్కబడుతాయి. ఆందోళన తొలగి కుదటపడుతారు. రుణ విముక్తులవుతారు. ఖర్చులు భారమనిపించవు. ఆత్మయులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు సానూకూలమవుతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, పనిభారం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. స్టేషనరీ, ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. విద్యార్ధులకు అత్యుత్సాహం తగదు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆర్థికలావాదేవీలు కొలిక్కి వస్తాయి. మానసికంగా కుదుటపడుతురు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. చక్కని ప్రణాళికలు రూపొందిచుంకుంటారు. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు విపరీతం. చెల్లింపులు నగదు స్వీకరణలో జాగ్రత్త. దంపతులు అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. అనాలోచితంగా వ్యవహరించవద్దు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. సహోద్యోగులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
గుట్టుగా యత్నాలు సాగించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఒత్తిడి, ఆందోళన అధికం. ఊహించని ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. ఆది, సోమ వారాల్లో పనులు సాగక విసుగు చెందుతారు. మీలో వేదాతం ధోరణి నెలకొంటుంది. ఆత్మీయుల కలయికత కుదుటపడుతారు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆరోగ్యం సంతృప్తికరం. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. అధికారులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. గృహమార్పు అనివార్యం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులకు కొత్త పరిచయాలేర్పడతాయి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం క్షేమం కాదు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ధనానికి ఇబ్బంది ఉండదు. మంగళ, బుధ వారాల్లో చాకచక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. మీ శ్రీమతి సలహా తీసుకోండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతానానికి రెండో విడత కౌన్సెలింగ్ అనుకూలం. తొందరపాటు నిర్ణయాలు తగవు. కాంట్రాక్టులు, ఏజెన్నీలు చేజిక్కించుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు బాధ్యతలు అధికమవుతాయి.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. అనుభవజ్ఞుల సలహా పాటించండి. అంచనాలు ఫలిస్తాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు అధికం. అవసరాలు నెరవేరుతాయి. రుణవిముక్తులవుతారు. బంధువుల రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. గురు, శుక్ర వారాల్లో పనులు అర్ధాంతంగా ముగిస్తారు. నగదు, పత్రాలు జాగ్రత్త. కొన్ని విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు. ప్రియతములతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. పట్టుదలతో సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వ్యాపారాల విస్తరణకు సమయం కాదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. యత్నాలను విరమించుకోవద్దు. పనులు మందకొడిగా సాగుతాయి. సంతానం గురించి ఆందోళన చెందుతారు. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. బాధ్యతలు అప్పగించవద్దు. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. శనివారం నాడు ప్రతి విషయం స్వయంగా చూసుకోవాలి. ఆత్మీయుల కలయికతో కుదుటపడుతారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తులవారికి సామాన్యం. ప్రయాణం చేయవలసి వస్తుంది. 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. వివాహయత్నాలు తీవ్రం చేస్తారు. ఒక సమాచారం నిరుత్సాహపరుస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. విమర్శలకు దీటుగా స్పందిస్తారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఆది, సోమ వారాల్లో ఖర్చులు విపరీతం. అవసరాలు నెరవేరుతాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు మందకొడిగా సాగుతాయి. గృహమార్పు అనివార్యం. పోగొట్టుకున్న పత్రాలు లభిస్తాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. మీ ఆలోచనలు సత్ఫలితాలిస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. భాగస్వామిక చర్చలు కొలిక్కి వస్తాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదా మార్పు, అదనపు బాధ్యతలు.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అన్ని రంగాల వారికి ఆశాజనకమే. గృహమార్పు కలిసివస్తుంది. పదవుల స్వీకరణకు అనుకూలం. బాధ్యతలు, పరిచయాలు అధికమవుతాయి. తొందరపడి హామీలివ్వవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. మంగళ, బుధ వారాల్లో పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. వాగ్ధాటితో ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. అనేక పనులతో సతమతమవుతారు. దుబారా ఖర్చులు విపరీతం. కుటుంబీకుల కోసం ధనవ్యయం చేస్తారు. వస్తువుల కొనుగోలులో నాణ్యతను గమనించండి. నోటీసులు, పత్రాలు అందుకుంటారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. ఏజెంట్లు, మార్కెట్ రంగాలవారి ఆదాయం బాగుంటుంది. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. 
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదారు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు తగ్గించుకోండి. ధనసహాయం ఆశించవద్దు. మీ గౌరవాభిమానాలకు భంగం కలిగే ఆస్కారం ఉంది. ఓర్పుతో వ్యవహరించండి. ఆప్తులను కలుసుకుంటారు. మీ శ్రీమతి సలహా పాటించండి. పనులు మెుండిగా పూర్తిచేస్తారు. సంతానం ఉన్నత చదువులపై మరింత శ్రద్ధ అవసరం. విద్యాప్రకటనలను విశ్వసించవద్దు. ఆది, గురు వారాల్లో వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఈ ఇబ్బందులు, సమస్యలు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా సర్దుకుంటాయి. గృహమార్పు వలన ప్రయోజనం ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వృత్తుల వారికి సామాన్యం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. జూదాలు, బెట్టింగ్‌లు జోలికి పోవద్దు.  
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. ఆదాయ వ్యయాలు పర్వాలేదనిపిస్తాయి. ఖర్చులు అదుపులో ఉండవు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. పనులు మెుండిగా పూర్తిచేస్తారు. మంగళ, శని వారాల్లో అనవసర జోక్యం తగదు. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. నిర్మాణాలు, మరమ్మత్తులు వేగవంతమవుతాయి. పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు. ఏజెన్సీలు, కాంట్రాక్టులు లాభిస్తాయి. మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. వీడియో చూడండి...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి ఆలయం ఐదు రోజులు కాదు.. తొమ్మిది రోజులు మూతపడనుందట..