Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వార ఫలితాలు : 01-04-18 తేదీ నుంచి 07-04-18 వరకు....

ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు ఉంటాయి. రుణ యత్న ఫలిస్తుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడుతారు. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. సంతానం భవిష్యత్‌పై దృష్టిసారిస్తారు.

Advertiesment
వార ఫలితాలు : 01-04-18 తేదీ నుంచి 07-04-18 వరకు....
, శనివారం, 31 మార్చి 2018 (17:20 IST)
మేషం : అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం 
ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు ఉంటాయి. రుణ యత్న ఫలిస్తుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడుతారు. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. సంతానం భవిష్యత్‌పై దృష్టిసారిస్తారు. ప్రతి విషయం క్షుణ్ణంగా పరిశీలించాలి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. శుభకార్యంలో పాల్గొంటారు. ఆది, గురువారాల్లో ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. ఫోన్ సందేశాలు, ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. 
సంప్రదింపులు వాయిదాపడతాయి. దంపతుల మధ్య అవగాహన లోపం. అకారణం కలహం. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోండి. ఆత్మీయుల రాకతో ఉపశమనం పొందుతారు. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. రాబోయే ఆదాయానికి ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. పొదుపునకు అవకాశం లేదు. రుణాలు చేయవలసి వస్తుంది. సాయం చేసేందుకు అయిన వారే సందేహిస్తారు. మంగళ, శనివారాల్లో పట్టుదలతో శ్రమించినగానీ పనులు పూర్తికావు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు ధన ప్రలోభం తగదు. వ్యాపారాలు నిరుత్సాహరుస్తాయి. నోటీసులు అందుకుంటారు. వృత్తుల వారికి సామాన్యం. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం. ప్రయాణంలో జాగ్రత్త. వాహన చోదకులకు చికాకులు అధికం. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. 
సంప్రదింపులు అనుకూలం. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. మీ కృషి ఫలిస్తుంది. ఆందోళన తొలగి కుదుటపడతారు. ధనలాభం ఉంది. ఖర్చులు భారమనిపించవు. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. గురు, శుక్రవారాల్లో పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు పోటీని ధీటుగా ఎదుర్కొంటారు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వృత్తులవారికి సంబంధాలు బలపడతాయి. అధికారులకు కొత్త బాధ్యతలు, పనిభారం. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, అశ్లేష.
మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. నిర్ధిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. శనివారంనాడు విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. పెద్దల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్య సేవలు అవసరమవుతాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టిసారిస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. వైద్య, సేవ, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. సన్మాన సాహిత్య సభల్లో పాల్గొంటారు. వివాదాలు జటిలమవుతాయి. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. 
శుభకార్యంలో పాల్గొంటారు. మీ రాక ఆత్మీయులకు సంతోషాన్నిస్తుంది. సంప్రదింపులు, ఒప్పందాలకు అనుకూలం. మీ ఇష్టాయిష్టాలకు లౌక్యంగా వ్యక్తం చేయండి. పనుల హడావుడిగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం అనుకూలించదు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఆందోళన తొలగి కుదుటపడతారు. ఒక వ్యవహారం లాభిస్తుంది. ధనమూలక సమస్యలు తొలగుతాయి. ఖర్చులు భారమనిపించవు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. సంతానం కదలికలపై దృష్టిసారించండి. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. సభలు, సేవా కార్యక్రమాల్లో ప్రముఖంగా పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. 
ఈవారం అనుకూలతలు ఉంటాయి. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. వాగ్ధాటితో ఆకట్టుకుంటారు. ధనలాభం ఉంటుంది రణ బాధలు తొలగుతాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. బంధుత్వాలు బలపడతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. పొదుపు పథకాలు, పెట్టుబడులకు అనుకూలం. ఆచితూచి వ్యవహరించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. కుటుంబీకుల సలహా పాటించండి. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. కీలకమైన పత్రాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ముఖ్యం రిప్రజెంటేటివ్‌లకు సదావకాశం లభిస్తుంది. ప్రయాణంలో ఒకింత అవస్థలు తప్పవు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాక 1, 2, 3 పాదాలు. 
ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. రుణ విముక్తులవుతారు. పనులు సానుకూలమవుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టిసారిస్తారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. పెట్టుబడులకు అనుకూలం. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సహాయం తగదు. సంప్రదింపులు, ఒప్పందాలకు అనుకూలం. స్తోమతకుమించి ఆహాలివ్వొద్దు. ఆచితూచి వ్యవహరించాలి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లతో జాగ్రత్త. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వృత్తులవారికి ఆదాయాభివృద్ధి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట. 
పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యతిరేకుల సన్నిహితులవుతారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు ధనప్రలోభం తగదు. సాంకేతిక రంగాల వారికి పురోభివృద్ధి. వ్యాపారాల్లో నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు. భాగస్వామిక చర్చలు కొలిక్కి వస్తాయి. ఆందోళన తొలగి కుదుటపడతాయి. ఆత్మీయుల సలహా లాభిస్తుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మంగళ, బుధవారాల్లో పనులు అర్ధాంతరంగా నిలిపివేయవలసి వస్తుంది. మీపై శకునాల ప్రభావం అధికం. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. పెట్టుబడులకు అనుకూలం. సరుకు నిల్వలో జాగ్రత్త. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకం. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. 
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడివుంటుంది. ఖర్చులు విపరీతం. మీ అంచనాలు ఫలిస్తాయి. గృహనిర్మాణాలకు అనుమతులు మంజూరవుతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. గురు, శుక్రవారాల్లో పనులు మొండిగా పూర్తి చేస్తారు. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్య కలిగిస్తుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. ఆస్తి, స్థల వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
మకరం : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
పెట్టుబడులు, పొదుపు పథకాలు లాభిస్తాయి. శుభకార్యయత్నం ఫలిస్తుంది. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషించాలి. ఒక వ్యవహారంలో ధనం అందుతుంది. ఆందోళన తొలగి కుదుటపడతారు. ఆచితూచి వ్యవహరించాలి. మీ అభిప్రాయాలను మధ్యవర్తుల ద్వారా తెలియజేయండి. పనులు హడావుడిగా సాగుతాయి. శనివారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి, ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. కంప్యూటర్, సాంకేతిక రంగాల వారికి పురోభివృద్ధి. క్రయ, విక్రయాలు ఊపందుకుంటాయి. షాపుల స్థల మార్పు అనివార్యం. హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం. క్రీడాకారులకు నిరుత్సాహం. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. 
శుభకార్యంలో పాల్గొంటారు. బంధువుల ఆదరణ సంతృప్తినిస్తుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. ఆర్థికలావాదేవీలు సజావుగా సాగుతాయి. నిర్ధిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఖర్చులు సంతృప్తికరం. ధనానికి ఇబ్బంది ఉండదు. ఆత్మీయులకు సాయం అందిస్తారు. కొన్ని పనులు అనుకోకుండా పూర్తవుతాయి. ఆది, సోమవారాల్లో మీ జోక్యం అనివార్యం. ఫోన్ సందేశాలు ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. నోటీసులు అందుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మీ శ్రీమతి ఆకస్మిక ప్రయాణం ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. టెండర్లు, ఏజెన్సీలు దక్కించుకుంటారు. ఉద్యోగస్తులు కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. విద్యార్థుల ఒత్తిడికి అధికం. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి. 
మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. సమస్యలను ధీటుగా ఎదుర్కొంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. పరిచయాలు బలపడతాయి. బాధ్యతగా వ్యవహరించాలి. ఎవరినీ తక్కువగా అంచనా వేయొద్దు. మంగళ, బుధవారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. పొగడ్తలు, మొహమ్మాటాలక పోయి ఇబ్బందులెదుర్కొంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులుంటాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. వృత్తులవారికి ప్రజాసంబంధాలు బలపడతాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. అధికారులకు సాదరవీడ్కోలు పలుకుతారు. విందులు, వినోదాల్లో మితంగా ఉండాలి. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాస ఫలితాలు - 01-04-2018 నుంచి 30-04-2018