Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ వారం రాశి ఫలితాలు... మార్చి 25వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు (Video)

కర్కాటకంలో రాహువు, తులలో వక్రి బృహస్పతి, ధనస్సులో శని, కుజులు, మకరంలో కేతువు, మీనంలో రవి, వక్రి బుధులు. మిథున, కర్కాటక, సింహ, కన్యలలో చంద్రుడు. 26న శుక్రుడు మీన ప్రవేశం. 25న శ్రీరామనవమి, 26 ధర్మరాజు దశమి, 30న ఒంటిమిట్ట కల్యాణం. మేషం: అశ్వని, భరణి, క

Advertiesment
ఈ వారం రాశి ఫలితాలు... మార్చి 25వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు (Video)
, శనివారం, 24 మార్చి 2018 (22:08 IST)
కర్కాటకంలో రాహువు, తులలో వక్రి బృహస్పతి, ధనస్సులో శని, కుజులు, మకరంలో కేతువు, మీనంలో రవి, వక్రి బుధులు. మిథున, కర్కాటక, సింహ, కన్యలలో చంద్రుడు. 26న శుక్రుడు మీన ప్రవేశం. 25న శ్రీరామనవమి, 26 ధర్మరాజు దశమి, 30న ఒంటిమిట్ట కల్యాణం.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. అయినవారిని విందులకు ఆహ్వానిస్తారు. పనుల ప్రారంభంలో చికాకులెదురవుతాయి. యత్నాలు విరమించుకోవద్దు. శనివారం నాడు బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ధనలాభం వుంది. ఖర్చులు భారమనిపించవు. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ అవసరం. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. అవివాహితుల ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యం సంతృప్తికరం. వారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారుల తీరును గమనించి మెలగండి. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఈ వారం సంప్రదింపులు, ఒప్పందాలకు అనుకూలం. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అప్రమత్తంగా ఉండాలి. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటానికి యత్నించండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. అర్థాంతంగా నిలిపివేసిన పనులు పూర్తవుతాయి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. బంధువుల వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. యాదృచ్ఛికంగా పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు ఏమంత ఫలితాలనీయవు. ఆలయాలను సందర్శిస్తారు. జూదాలు, బెట్టింగ్‌ల జోలికి పోవద్దు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. 
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు  
ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ సలహా ఎదుటివారికి ఉపకరిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఆర్థిక అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ప్రముఖుల ఇంటర్వ్యూల కోసం పడిగాపులు తప్పవు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. తొందరపడి చెల్లింపులు జరుపవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. దైవదర్శనాలు ప్రశాంతంగా సాగుతాయి. ప్రయాణం తలపెడతారు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వేడుకలు, దైవ కార్యాలకు సన్నాహాలు సాగిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. గృహమార్పు కలిసివస్తుంది. పనులు హడావుడిగా సాగుతాయి. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఆది, సోమవారాల్లో ఏకపక్షంగా వ్యవహరించవద్దు. మీపై వచ్చిన నిందలు తొలగిపోగలవు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. సంతానం ఉన్నత చదువులపై శ్రద్ధ అవసరం. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తులకు పదవీయోగం, నగదు ప్రోత్సాహకం. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం  
ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ధనసహాయం అర్ధించేందుకు మనస్కరించదు. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. గుట్టుగా యత్నాలు సాగించండి. మంగళ, బుధవారాల్లో ఊహించని సమస్యలెదురవుతాయి. అకారణ కలహం, చికాకులు తలెత్తుతాయి. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగాలి. అనవసర జోక్యం తగదు. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ అవసరం. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2, 3 పాదాలు 
దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వేడుకల్లో పాల్గొంటారు. బంధువుల వైఖరి బాధిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనానికి ఇబ్బంది వుండదు. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. గృహమార్పు అనివార్యం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. గురు, శుక్రవారాల్లో ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. అధికారులకు ధనప్రలోభం తగదు. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. ప్రముఖుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది.
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు.  
కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పెట్టుబడుల సమాచారం అందుతుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. అపరిచితులతో జాగ్రత్త. శనివారం నాడు మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వకండి. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. సన్నిహితులకు చక్కని సలహాలిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు సామాన్యం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. మీ పథకాలు నిదానంగా ఫలితాలిస్తాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ప్రయాణం కలిసివస్తుంది.
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట  
పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు అవసరం. పనులు వేగవంతమవుతాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. వివాహ యత్నాలు తీవ్రం చేస్తారు. ఆది, సోమవారాల్లో దంపతుల మధ్య అవగాహన లోపం. సంయమనంతో మెలగండి. సంతానం భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగ బాధ్యతల్లో నిర్లక్ష్యం తగదు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి.
 
ధనుర్‌రాశి : మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. శుభవార్తలు వింటారు. కష్టం ఫలిస్తుంది. ఆందోళన తొలగి కుదుటపడతారు. పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది ఉండదు. విలువైన వస్తువులు అమర్చుకుంటారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. మంగళ, బుధవారాల్లో ఫోన్ సందేశాలు, ప్రకటనలను విశ్వసించవద్దు. పరిచయాలు బలపడతాయి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. వేడుకల్లో పాల్గొంటారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. పెట్టుబడులు, పొదుపు పథకాలు లాభిస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. షాపుల స్థలమార్పు అనివార్యం. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
మకరం : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
అన్ని రంగాల వారికి ఆశాజనకమే. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు భారమనిపించవు. రుణ విముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. వ్యవహారాలు పురోగతిన సాగుతాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. మీ శ్రీమతి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆది, గురువారాల్లో అనవసర విషయాల్లో జోక్యం తగదు. ఇతరుల బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. పోగొట్టుకున్న పత్రాలు, వస్తువులు తిరిగి పొందుతారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. 
గృహమార్పు కలిసివస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. పనులు వేగవంతమవుతాయి. మంగళ, శనివారాల్లో బాధ్యతలు, వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. సలహాలు, సహాయం ఆశించవద్దు. కొన్ని సమస్యల నుంచే క్షేమంగా బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. మీ సలహా ఆత్మీయులకు ఉపకరిస్తుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడుతారు. పెట్టుబడులకు అనుకూలం. ప్రాజెక్టులు, పరిశ్రమల స్థాపనలకు వనరులు సర్దుబాటవుతాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం, ధనలాభం. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. కళాకారులకు ప్రోత్సాహకరం.
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలు కాగలవు. పనుల సానుకూలతకు ఓర్పు అవసరం. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. గురు, శుక్రవారాల్లో అతిగా ఆలోచించవద్దు. ప్రేమానుబంధాలు, పరిచయాలు బలపడతాయి. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. పెట్టుబడులకు అనుకూలం. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. కంప్యూటర్, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం. దైవకార్యంలో పాల్గొంటారు. వీడియోలో...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్కడ పుట్టుమచ్చ వున్న స్త్రీ యొక్క భర్త బాగా సంపాదిస్తాడట...