Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ వారం మీ రాశి ఫలితాలు (22-01-2018 నుంచి 28-01-2018 వరకు)

పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ అవసరం. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. పనులు సానుకూలమవు

Advertiesment
ఈ వారం మీ రాశి ఫలితాలు (22-01-2018 నుంచి 28-01-2018 వరకు)
, ఆదివారం, 21 జనవరి 2018 (22:11 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ అవసరం. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు సామాన్యం. మంగళ, బుధవారాల్లో కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. బాధ్యతలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఫోన్ సందేశాలు, అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వాణిజ్య ఒప్పందాలు, వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ధనప్రలోభం తగదు. సామాజిక కార్యక్రమాలు వేడుకలో పాల్గొంటారు. ప్రయాణం కలిసివస్తుంది. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు 
కొత్త విషయాలు తెలుసుకుంటారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఖర్చులు సామాన్యం. రుణ బాధలు కొంత మేరకు తొలగుతాయి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం నిరీక్షిస్తారు. గురు, శుక్రవారాల్లో బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత అనుభవాలు జ్ఞప్తికొస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, శ్రమ అధికం. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. కళ, క్రీడారంగాల వారికి ప్రోత్సాహకరం. 
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. యత్నాలను విరమించుకోవద్దు. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఒత్తిళ్లు, మొహమ్మాటాలకు లొంగవద్దు. పెద్దల సలహా పాటించండి. అవివాహితుల ఆలోచనలు పలువిధాలుగా ఉంటాయి. దంపతులకు ఏకాగ్రత లోపం. శనివారం నాడు మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. సంతానం విషయాల్లో శుభపరిణమాలు సంభవం. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చిరువ్యాపారులకు సామాన్యం. వృత్తుల వారికి ఆశాజనకం. ఆడిటర్లు, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఆది, సోమవారాల్లో పనుల ప్రారంభంలో ఆటంకాలెదుర్కుంటారు. వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అధికారులు, సహోద్యోగులతో సత్సంబంధాలు నెలకొంటాయి. నిరుద్యోగులు కృషి ఫలిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. గృహమార్పు యత్నం ఫలిస్తుంది. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. విద్యార్థులకు ఏకాగ్రత లోపం, ఒత్తిడి. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
శుభకార్యయత్నం ఫలిస్తుంది. వివాహ వేదికలను అన్వేషిస్తారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. బ్యాంకు వివరాలు, కుటుంబ విషయాలు వెల్లడించవద్దు. మంగళ, బుధవారాల్లో ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోవాలి. ఇతరుల బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రుణవిముక్తులవుతారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంతానం కదలికలపై దృష్టి సారించండి. పెట్టుబడులకు అనుకూలం. పెద్ద సంస్థలతో భాగస్వామ్యం లాభిస్తుంది. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. అధికారులు కొత్త బాధ్యతలు, పనిభారం, విశ్రాంతి లోపం.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2, 3 పాదాలు 
స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన వస్తుంది. కొన్ని ఇబ్బందులు తొలగి కుదుటపడతారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఆది, గురువారాల్లో పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. సలహాలు, సాయం ఆశించవద్దు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉపాధ్యాయుల కృషి ఫలిస్తుంది. రిప్రజెంటేటివ్‌లు, అక్కౌంట్స్ రంగాల వారికి శ్రమ అధికం. కోర్టు వాయిదాలకు హాజరవుతారు.
 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
వ్యవహారానుకూలత, పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. యత్నాలు కొనసాగించండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. సంప్రదింపులు ఫలించవు. పట్టుదలతో కృషి చేయండి. త్వరలో శుభవార్త వింటారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. మంగళ, శనివారాల్లో ప్రకటనలు, ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. ఆరోగ్యం సంతృప్తికరం. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి అధికం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 
ఖర్చులు సామాన్యం. మొండి బాకీలు వసూలవుతాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు క్షేమం కాదు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు వేగవంతమవుతాయి. చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు. సంప్రదింపులకు అనుకూలం. ఆత్మీయుల సలహా పాటించండి. గురు, శుక్రవారాల్లో సొంత నిర్ణయాలు తగవు. ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. నోటీసులు, పత్రాలు అందుకుంటారు. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం 
ఒక వ్యవహారంలో ధనం అందుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను వదులుకోవద్దు. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. మీ కష్టం వృధా కాదు. శనివారం నాడు పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. దంపతుల మధ్య దాపరికం తగదు. ఒక వ్యవహారంలో పెద్దల జోక్యం అనివార్యం. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ప్రియతముల రాక ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. మీ పథకాలు, ప్రణాళికలు నిదానంగ ఫలిస్తాయి. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. వేడుకల్లో పాల్గొంటారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అధికం. రాబడిపై దృష్టి పెడతారు. అయిన వారి వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు.  మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఎవరినీ నొప్పించవద్దు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ఆందోళన తొలగి కుదుటపడతారు. నగలు, నగదు జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరం. బెట్టింగ్‌లు, జూదాల జోలికి పోవద్దు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. గృహమార్పు యత్నం కలిసివస్తుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. వాగ్ధాటితో ఆకట్టుకుంటారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. పనులు అప్పగించవద్దు. ఖర్చులు అంచనాలకు మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. సోదరీ సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధికి బాగా శ్రమిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. 
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర, రేవతి 
శుభకార్యం, గృహమార్పునకు యత్నాలు సాగిస్తారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఆది, సోమవారాల్లో ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. మీ కష్టం ఫలిస్తుంది. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు వేగవంతమవుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగపడుతుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు తలెత్తుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. వేడుకలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆదివారం దినఫలితాలు : ఆర్థిక లావాదేవీలు సమర్థంగా..