Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

24-12-2017 నుంచి 30-12-2017 మీ వార రాశి ఫలితాలు(Video)

కర్కాటకంలో రాహువు, తులలో గురు, కుజులు, వృశ్చికంలో బుధుడు, ధనస్సులో రవి, శుక్ర, శని, మకరంలో కేతువు. కుంభ, మీన మేషంలలో చంద్రుడు. 29న వైకుంఠ ఏకాదశి. 24న బుధుడు ధనస్సు నందు ప్రవేశం. మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం మనోధైర్యంతో ముందుకు సాగండి. కార్య

Advertiesment
24-12-2017 నుంచి 30-12-2017 మీ వార రాశి ఫలితాలు(Video)
, శనివారం, 23 డిశెంబరు 2017 (20:51 IST)
కర్కాటకంలో రాహువు, తులలో గురు, కుజులు, వృశ్చికంలో బుధుడు, ధనస్సులో రవి, శుక్ర, శని, మకరంలో కేతువు. కుంభ, మీన మేషంలలో చంద్రుడు. 29న వైకుంఠ ఏకాదశి. 24న బుధుడు ధనస్సు నందు ప్రవేశం. 
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
మనోధైర్యంతో ముందుకు సాగండి. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆలోచనలు నిలకడగా వుండవు. పెద్ద  ఖర్చు తగిలే ఆస్కారం వుంది. ధనం మితంగా వ్యయం చేయండి. వేడుకలు, విందుల్లో పాల్గొంటారు. శని, ఆదివారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. దంపతుల మధ్య సఖ్యత లోపం. విమర్శలు, వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. ఏకపక్షంగా వ్యవహరించొద్దు. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు.  మీ వాహనం ఇతురలకు ఇవ్వడం క్షేమం కాదు. విద్యార్థులకు ఒత్తిడి అధికం. 
 
వృషభం: కృత్తి 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు 
ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. అవగాహనలేని విషయాల్లో జోక్యం తగదు. సోమ, మంగళవారాల్లో ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వివాదాస్పదమవుతుంది. మీ తప్పిదాలను సరిదిద్దుకోవడం అవసరం. పెద్దల సలహా పాటించండి. సంప్రదింపులు పరిష్కార దిశగా సాగుతాయి. కుటుంబీకుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆలోచనలను కార్యరూపంలో పెడతారు. అవకాశాలను వదులుకోవద్దు. రోజువారీ ఖర్చులే వుంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నోటీసులు, పత్రాలు అందుకుంటారు. ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరం. దైవ, సామాజిక కార్యక్రమాల్లో ప్రముఖంగా పాల్గొంటారు. 
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. బుధవారం నాడు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. రుణదాతల ఒత్తిళ్లు తొలగుతాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. సంతానం గురించి ఆలోచిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప  చికాకులు మినహా ఇబ్బందులుండవు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం. సహోద్యోగులతో విందులు. వినోదాల్లో పాల్గొంటారు. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. మీ ఉన్నతిని చూసి కొంతమంది అపోహపడే ఆస్కారం ఉంది. సంప్రదింపులు, ఒప్పందాలకు అనుకూలం. ఆది, సోమవారాల్లో  స్వల్ప అస్వస్థతకు గురవుతారు.  వైద్య సేవలకు అవసరమవుతాయి. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, పనిభారం. సహోద్యోగులతో జాగ్రత్త. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
కొత్త యత్నాలకు స్వీకారం చుడతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. మాటతీరుతో ఆకట్టుకుంటారు. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పరిచయాలు, ప్రేమానుబంధాలు బలపడతాయి. ఖర్చులు అంచనాలను మించుతాయి. విలసాలకు బాగా వ్యయం చేస్తారు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. సాధ్యంకాని హామీలివ్వవద్దు. ఇతరుల తీరును గమనించి మెలగండి. మంగళ, బుధవారాల్లో అనేక పనులతో సతమతమవుతారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ఆధ్యాత్మిక, ఆరోగ్యం విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. దైవ , సేవా సంస్థలకు సాయం చేస్తారు. గృహమార్పు యత్నం ఫలిస్తుంది. పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఖర్చులు అధికం. ప్రయోజనకరం. ఆప్తులకు సాయం అందిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా పడతాయి. ముఖ్యులను కలుసుకుంటారు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆది, గురువారాల్లో పనులు ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి. పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులకు శుభవార్తా శ్రవణం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. వేడుకలు, తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. విద్యార్థుల్లో ఏకాగ్రత నెలకొంటుంది. ప్రయాణం, దైవదర్శనాల్లో చికాకులెదుర్కుంటారు. 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. కొంత మొత్తం ధనం అందుతుంది. ఖర్చులు భారమనిపించవు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ముఖ్యుల ఇంటర్వ్యూ కోసం నిరీక్షణ తప్పదు. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. మంగళ, శనివారాల్లో ఏకపక్షంగా వ్యవహరించవద్దు. ఉత్సాహంగా ముందుకుసాగండి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు వైద్య సేవలు అవసరం. అతిగా ఆలోచించవద్దు. ఆత్మీయుల సలహా పాటించండి. క్రయవిక్రయాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ప్రాజెక్టులు, గృహ నిర్మాణాలకు రుణాల మంజూరవుతాయి. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. వేడుకల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత్త ప్రధానం. దైవ దర్శనాలు, పుణ్యకార్యాలు సంతృప్తినిస్తాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనురాధ, జ్యేష్ట 
మీ నుంచి విషయ సేకరణకు కొంతమంది యత్నిస్తారు. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. గురు, శుక్రవారాల్లో నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. మానసికంగా కుదుటపడతారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పట్టుదలతో శ్రమించినగాని పనులు పూర్తికావు. అవగాహనలేని విషయాల్లో జోక్యం తగదు. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ అవసరం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరషాఢ 1వ పాదం
సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. మనోధైర్యంతో ముందుకు సాగండి. సహాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. శనివారంనాడు మంచి చేయబోతే చెడు ఎదురయ్యే పరిస్థితులు ఎదురవుతాయి. పరిచయస్తుల వ్యాఖ్యలు ఆలోచింపజేస్తాయి. ఒక వ్యవహారంలో ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పెట్టుబడులు, పొదుపు పథకాలకు అనుకూలం కాదు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. సోదరీ సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. పనులు, గృహ నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. హోల్‌సేల్ వ్యాపారాలు, స్టాకిస్టులకు ఆశాజనకం.
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
పరిచయాలు. వ్యాపకాలు విస్తరిస్తాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. పనులు సజావుగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. వ్యవహారాల్లో మీదే పైచేయి. కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. సాధ్యంకాని హామీలివ్వవద్దు. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. గత అనుభవాలు అనుభూతిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఉద్యోగస్తులకు శుభవార్తా శ్రవణం. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. దైవ, సేవా కార్యక్రమాలు, సభలు సమావేశాల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
ఈ వారం ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. సర్వత్రా అనుకూలతలుంటాయి. అవిశ్రాంతంగా శ్రమించి అనుకున్నది సాధిస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ధనప్రాప్తి, వస్తులాభం, వాహన యోగం ఉన్నాయి. రుణ విముక్తులవుతారు. ఖర్చులు భారమనిపించవు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. మీ శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. బంధువులరాక ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సాంకేతిక, విద్య, వైద్య రంగాల వారికి పురోభివృద్ధి వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. మీ పథకాలు నిదానంగా ఫలిస్తాయి. విద్యార్థులు పోటీల్లో రాణిస్తారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్రరాబాద్ర, రేవతి
ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆర్థిక లావాదేవీలతో హడావుడిగా ఉంటారు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరినీ సలహాలు అడగవద్దు. పనులు వేగవంతమవుతాయి. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. ఆది, సోమవారాల్లో కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. సోదరీ సోదరుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. గుట్టుగా యత్నాలు సాగించండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. వృత్తుల వారికి ప్రజా సంబంధాలు బలపడతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. దైవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

23-12-2017 శనివారం రాశి ఫలితాలు