Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆదివారం దినఫలితాలు : ఆర్థిక లావాదేవీలు సమర్థంగా..

మేషం : ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్ల శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. విలువైన వస్తువులు, వాహనం అమర్చుకుంటారు. పోస్టల్, ఎల్.ఐ.సి. ఏజెంట్లకు ఒత్తిడి పెరుగుతుంది. మీ

Advertiesment
ఆదివారం దినఫలితాలు : ఆర్థిక లావాదేవీలు సమర్థంగా..
, ఆదివారం, 21 జనవరి 2018 (10:19 IST)
మేషం : ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్ల శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. విలువైన వస్తువులు, వాహనం అమర్చుకుంటారు. పోస్టల్, ఎల్.ఐ.సి. ఏజెంట్లకు ఒత్తిడి పెరుగుతుంది. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మొదలెడతారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాలు అనుకూలిస్తాయి.
 
వృషభం : కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. పత్రిక, ప్రైవేటు సంస్థల్లోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. ఆకస్మిక ప్రయాణాలు తప్పవు. వాహన చోదకులకు చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు, క్లయింలు మంజూరవుతాయి. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అప్రమత్తంగా మెలగండి.
 
మిథునం : ఆస్తి పంపకాలకు సంబంధించి సోదరీ, సోదరులతో ఒక అవగాహనకు వస్తారు. అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికం. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు చేపడతారు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. బంధువులతో పట్టింపులు ఎదుర్కొంటారు.
 
కర్కాటకం : విద్యార్థులు భయాందోళనలు వీడి శ్రమిస్తే ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. ఉద్యోగస్తుల హోదా పెరగటంతోపాటు బరువు బాధ్యతలు అధికమవుతాయి. బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడతాయి. ఖర్చులు పెరిగినా సార్థకత ఉంటుంది.
 
సింహం : ఆకస్మిక ధనప్రాప్తి, రావలసిన ధనం చేతికి అందటంతో మీలో పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్లు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనులలో ఒత్తిడి, చికాకులు తప్పవు. ప్రముఖులకు విలువైన కానుకలు అందించి వారికి ఆకట్టుకుంటారు. కుటుంబంలో అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి.
 
కన్య : గృహంలో నెలకొన్న అశాంతి తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. ఏకాగ్రతా లోపం, చంచలత్వం వల్ల విద్యార్థులకు ఒత్తిడి, మందలింపులు తప్పవు. నూతన పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఆశాజనకం.
 
తుల : భాగస్వామిక వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. సన్నిహితుల ప్రోత్సాహంతో కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక స్థితిలో కొంత వెసులుబాటు ఉంటుంది. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఖర్చులు, చెల్లింపులు అధికం. ధనవ్యయంలో ఏకాగ్రత వహించండి. గృహోపకరణకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు.
 
వృశ్చికం : స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ అతిథి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి. రుణాలు, ఫఈజులు సకాలంలో చెల్లిస్తారు. కష్ట సమయంలో సన్నిహితులకు అండగా నిలుస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయ్యే సూచనలున్నాయి. మీ సంతానం విద్య, వివాహ విషయాలపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు.
 
ధనస్సు : ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగాల్సి ఉంటుంది. మిత్రుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఆంతరంగిక వ్యాపార విషయాలు గోప్యంగా ఉంచండి. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. వ్యాపారాల విస్తరణలు, నూతన పెట్టుబడులకు అనుకూలం. కార్యసాధనలో అనుకూలతలుంటాయి.
 
మకరం : విద్యార్థులలో లక్ష్యంపట్ల ఏకాగ్రత, స్థిరబుద్ధి నెలకొంటాయి. స్త్రీలకు షాపింగ్‌లోను, వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. ఆడిటర్లు, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ప్రేమికులకు ఎడబాటు తప్పదు. ఆత్మీయులకు విలువైన కానుకలు అందిస్తారు. దూర ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.
 
కుంభం : ఉద్యోగస్తులకు ఒత్తిడి, చికాకులు అధికం అవుతాయి. తలపెట్టిన పనిలో అధికంగా శ్రమించి విజయాన్ని పొందుతారు. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పెద్దల ఆరోగ్యంలో మెలకువ అవసరం. సోదరీ, సోదరులతో ఏకీభవిస్తారు. రావలసిన ధనం అందటంతో పొదుపు పథకాల దిశగా మీ ఆలోచనలు సాగిస్తారు. ఖర్చులు అధికం కాగలవు.
 
మీనం : ఆర్థిక స్థితి సామాన్యంగా ఉన్నా, ఇబ్బందులుండవు. కార్యసాధనలో ఆటంకాలు ఎదురైనా ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకేయండి. ఉత్తర, ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. గృహంలో మార్పులు, చేర్పులు చేస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలోని వారికి చికాకులు అధికం అవుతాయి. ధనం ఎంత వస్తున్నా ఏ మాత్రం నిల్వచేయలేకపోతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ 21 మహా దోషాలు లేకపోతేనే సత్ఫలితాలు... ఏంటవి?