Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ రోజు రాశిఫలితాలు .. వ్యాపారులకు కలిసివచ్చే కాలం...

మేషం : వ్యాపారాల్లో కొత్త భాగస్వాములు చేరతారు. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. అతిధి మర్యాదలు బాగా నిర్వహిస్తారు. దైవ సేవా కార్యక్ర

ఈ రోజు రాశిఫలితాలు .. వ్యాపారులకు కలిసివచ్చే కాలం...
, శుక్రవారం, 19 జనవరి 2018 (08:26 IST)
మేషం : వ్యాపారాల్లో కొత్త భాగస్వాములు చేరతారు. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. అతిధి మర్యాదలు బాగా నిర్వహిస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి. 
 
వృషభం: నూనె, ఎండుమిర్చి, బెల్లం, చింతపండు, వ్యాపారస్తులకు కలిసివచ్చేకాలం. రవాణా రంగాల వారికి సంతృప్తి. పురోభివృద్ధి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మీకు దగ్గరగా ఉన్న, మీకే తెలియని ఒక అవకాశం మిమ్మల్ని వరిస్తుంది. ఒక ఖర్చు నిమిత్తం తెచ్చిన ధనం మరొక అవసరానికి వినియోగిస్తారు.
 
మిథునం: కొబ్బరి, పండ్లు, పూలు కూరగాయల వ్యాపారులు పురోభివృద్ధి పొందుతారు. బంధుమిత్రుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. ఇతరుల సహాయం అర్థించడం వల్ల మీ గౌరవానికి భంగం కలుగవచ్చు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది.
 
కర్కాటకం: ఉద్యోగినులకు ఉన్నత స్థితి దక్కుతుంది. కుటుంబీకులతో అనుకోన ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీ సమర్థత, నైపుణ్యం వెలుగులోకి వస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులు సత్తాచాటుకునేందుకు తగిన సమయం. కుటుంబ విషయంలో కూడా మీకు సానుకూల వాతావరణం నెలకొని ఉంటుంది. 
 
సింహం: వ్యాపారాల్లో పెట్టుబడులు అందుతాయి. మిత్రులతో విబేధాలు తలెత్తుతాయి. కళాకారులకు సత్కారాలు అందుతాయి. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. ఉద్యోగస్తులకు పై అధికారులతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. 
 
కన్య: పత్రికా రంగంలోని వారికి నిరుత్సాహం తప్పదు. మీ తొందరపాటు నిర్ణయాన్ని బంధుమిత్రులు వ్యతిరేకిస్తారు. బ్యాంక వ్యవహారాల్లో మెళకువ అవసరం. రావలసిన మొండి బాకీలు ఆలస్యమైనా కానీ వసూలవుతాయి. సేవా సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. 
 
తుల: బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. అకాల భోజనం వల్ల మీ ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది. 
 
వృశ్చికం: ఆర్థిక పరమైన సమస్యలు తీరుతాయి. బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులు అధిక ఒత్తిడి, ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. ఆర్థిక సమస్యలు మెరుగుపడుతాయి. స్త్రీలకు షాపింగ్ పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
ధనస్సు: వ్యాపార అభివృద్ధికి చేసే కృషి ఫలిస్తుంది. స్త్రీలకు బంధువులతో సఖ్యత నెలకొంటుంది. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా ఖర్చులు చేస్తారు. అందరికీ సహాయం చేసి మాటపడతారు. కాంట్రాక్టర్లకు నూతన అవకాశాలు లభించినా ఆర్థిక ఇబ్బందులు తప్పవు. మీ సంతానం వైఖరి చికాకు కలిగిస్తుంది. 
 
మకరం: అదనపు రాబడి దక్కడంతో ఉత్సాహంగా గడుపుతారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, రిజిస్ట్రేషన్లు అనుకూలిస్తాయి. మీ భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి స్నేహితులు మీకు కొత్తగా పరిచయం అవుతారు. ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు గుర్తిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు.
 
కుంభం: ఆర్థిక సమస్యలు మెరుగుపడుతాయి. స్త్రీలకు షాపింగ్‌ల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. పాత బాకీలు అనుకోకుండా వసూలవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సేల్స్ సిబ్బందికి ధన, వస్తు ప్రతిఫలం అందిస్తారు. మీ కృషికి తగిన ప్రతిఫలం ఆలస్యంగా అందుతుంది.
 
మీనం: వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. బంధువుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. విలువైన వస్తువులు కొనుగోళ్ల నిమిత్తం ధనం బాగా ఖర్చు చేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డబ్బు ఎంత శక్తివంతమైనది.. ఎలా చేస్తే డబ్బు నిలబడుతుంది...