Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాస ఫలితాలు - 01-04-2018 నుంచి 30-04-2018

ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టిసారిస్తారు. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆహ్వానాలు, కీలక పత్రాలు అందుకుంటారు. ఆత్మీయుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.

Advertiesment
మాస ఫలితాలు - 01-04-2018 నుంచి 30-04-2018
, శనివారం, 31 మార్చి 2018 (16:34 IST)
మేషరాశి : అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం.
ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టిసారిస్తారు. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆహ్వానాలు, కీలక పత్రాలు అందుకుంటారు. ఆత్మీయుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదాపడతాయి. సంతానం ఉన్నత చదువులపై శ్రద్ధ వహిస్తారు. ప్రకటనలు, మధ్యవర్తులను విశ్వసించవద్దు. వ్యవహారానుకూలత ప్రశాంతత పొందుతారు. గృహమార్పు కలిసివస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు భర్తీ చేసుకుంటారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. పెట్టుబడులకు అనుకూలం. ఆశావహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులు, కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సన్మాన, సాహిత్య సభల్లో ప్రముఖంగా పాల్గొంటారు. 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు. రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. 
ఈ మాసంలో ప్రతికూలతలే అధికం. పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. పరిచయం లేని వారితో జాగ్రత్త. అప్రమత్తంగా వ్యవహరించడి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. ధనమూలక సమస్యలెదురవుతాయి. ఆప్తుల సాయం అందుతుంది. ఒక ఆహ్వానం కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. పెద్దల సలహా పాటించండి. విలువైన వస్తువులు జాగ్రత్త. వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. అధికారులకు ధనప్రలోభం తగదు. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. విద్యార్థులు సామాన్య ఫలితాలే సాధిస్తారు. ప్రయాణాల్లో అవస్థలు తప్పవు. 
 
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు. ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. 
ఖర్చులు అధికం, ప్రయోజనకరం. కొంత మొత్తం ధనం అందుతుంది. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. విహాయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. సంతానం విజయం సంతోషానిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారుల తీరును గమనించి మెలగండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. సంస్థల స్థాపనలకు కావలసిన వనరులు సర్దుబాటవుతాయి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. 
 
కర్కాటక రాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష.
ఈ మాసం యోగదాయకమే. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఆహ్వానాలు, కీలక పత్రాలు అందుతాయి. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది ఉండదు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆదాయాభివృద్ధికి, పదవీయోగం పొందుతారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆరోగ్యం జాగ్రత్త. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. పెట్టుబడులకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. విదేశాలు, తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. 
ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. అవసరాలు, కోరికలు వాయిదా పడతాయి. పనులు సానుకూలతకు ఓర్పు, పట్టుదల ప్రధానం. ఈ చికాకులు, సమస్యలు తాత్కాలికమే. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆశావహ దృక్పథంతో మెలగండి. వ్యవహారాల్లో ప్రతికూలతలెదుర్కొంటారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. అవకాశాలు అందినట్టే అంది చేజారిపోతాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. యత్నాలు విరమించుకోవద్దు. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వైద్య, న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. ద్విచక్ర వాహనచోదకులకు దూకుడు తగదు. 
 
కన్యారాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు. హస్త, చిత్ర 1, 2 పాదాలు. 
అన్ని రంగాల వారికి బాగుంటుంది. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. పదవులకు యత్నాలు సాగిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. పరిచయం లేని వారితో జాగ్రత్త. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలివేయండి. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. విలువైన కానుకలు అందిస్తారు. మీ ఉన్నతి ఎదుటివారికి అసూయ కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు పదవీయోగం, ధనలాభం. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. ఆస్తి, భూవివాదాలు, కొలిక్కి వస్తాయి. సేవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. 
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. 
వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడుతారు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. దంపతుల అన్యోన్యత నెలకొంటుంది. ఆర్థిక లావాదేవీలు కొలిక్కి వస్తాయి. చక్కని ప్రణాళికలతో మందుకుసాగుతారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. పరిచయాలు బలపడతాయి. ఉద్యోగ బాధ్యతలు సమర్ధంగా నిర్వహిస్తారు. సహోద్యోగులతో జాగ్రత్త. అధికారులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట.
పెట్టుబడులపై దృష్టిసారిస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. మీ శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త. గృహమార్పు కలిసివస్తుంది. వేడుకలు, శుభకార్యాల్లో ప్రముఖంగా పాల్గొంటారు. బంధువుల ఆదరణ సంతృప్తినిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడుతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయ వ్యయాలకు పొంతనవుండదు. దుబారా ఖర్చులు విపరీతం. పొదుపునకు అవకాశం లేదు. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు. అధికారులకు ఒత్తిడి అధికం. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ప్రయాణం ఉల్లాసంగా సాగుతుంది. 
 
ధనుర్‌రాశి : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. 
ఈ మాసం శుభాశుభ ఫలితాల సమ్మేళనం. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. యత్నాలను విరమించుకోవద్దు. త్వరలో శుభవార్త వింటారు. దంపతుల మధ్య అరమరికలు తగవు. మీ ఇష్టాయిష్టాలకు లౌక్యంగా వ్యక్తం చేయడి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. సంతానం ఉన్నత చదువులపై శ్రద్ధ వహిస్తారు. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోవాలి. ఆహ్వానం, కీలక పత్రాలు అందుతాయి. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టిసారిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో అనుభవం గడిస్తారు. విద్యార్థులు చక్కని ఫలితాలు సాధిస్తారు. 
 
మకరం : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
గృహమార్పునకు యత్నాలు సాగిస్తారు. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పదవులు, బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఆర్థిక స్థితి ఆశాజనకం. రుణయత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. విలువైన వస్తువులు అమర్చుకుంటారు. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు భర్తీ చేసుకుంటారు. భాగస్వామిక చర్చలు కొక్త మలుపుతిరుగుతాయి. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. వాహన చోదకులకు దూకుడు తగదు. 
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. 
సంప్రదింపులు అనుకూలం. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. అయినవారి రాక సంతోషపరుస్తుంది. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. కుటుంబీకుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. నగదు, ఆభరణాలు జాగ్రత్త. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. కొంత మొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలెకొంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి, నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు అమలు చేస్తారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. 
 
మీనరాశి : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి. 
అన్ని రంగాలవారికి శుభమే. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు వేగవంతమవుతాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టిసారిస్తారు. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది ఉండదు. పెద్దమొత్తం సాయం క్షేమం కాదు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా తెలియజేయండి. ఎవరినీ నిందించవద్దు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. ఆందోళన తొలగుతుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. సరకు నిల్వలో జాగ్రత్త. ఉపాధి శిక్షణావకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి. విందులు, వేడుకల్లో అత్యుత్సాహం తగదు. మీ అలవాట్లు అదుపులో ఉంచుకోండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శనివారమే హనుమజ్జయంతి: సాయంత్రం ఆరు గంటలకు ఇలా చేయండి..