Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మార్చి మాస రాశి ఫలితాలు (01-03-2018 నుంచి 31-03-2018 వరకు)

ఈ మాసం ప్రథమార్థం యోగదాయకం. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. గృహంలో సందడి నెలకొంటుంది. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి.

Advertiesment
మార్చి మాస రాశి ఫలితాలు (01-03-2018 నుంచి 31-03-2018 వరకు)
, గురువారం, 1 మార్చి 2018 (08:54 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ మాసం ప్రథమార్థం యోగదాయకం. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. గృహంలో సందడి నెలకొంటుంది. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగదు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. సంతానం ఉన్నత చదువుల గురించి ఆలోచిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలెదురవుతాయి. ప్రముఖుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, పదవీయోగం, అధికారులకు వీడ్కోలు పలుకుతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
శుభకార్య యత్నం ఫలిస్తుంది. నిశ్చితార్థాలు, పెట్టిపోతల్లో మెలకువ వహించండి. మీ అభిప్రాయాలను పెద్దల ద్వారా తెలియజేయండి. వేడుకలను ఘనంగా చేస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. బాధ్యతలు అప్పగించవద్దు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. సలహాలు, సహాయం ఆశించవద్దు. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఈ మాసం మిశ్రమ ఫలితాల సమ్మేళనం. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. మీ రాక అయిన వారికి సంతోషాన్నిస్తుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. ప్రకటనలు, మధ్యవర్తులను విశ్వసించవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. భాగస్వామిక చర్చలు పురోగతిన సాగుతాయి. పెట్టుబడులకు అనుకూలం. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ అతిథి మర్యాదలు ఆకట్టుకుంటాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. గృహమార్పు అనివార్యం. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు నిదానంగా ఫలితాలనిస్తాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం, ధనలాభం. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. ప్రయాణంలో చికాకు పరుస్తుంది.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ఈ మాసంలో ప్రతికూలతలే అధికం. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ధనమూలక సమస్యలెదురవుతాయి. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. అవకాశాలు అందినట్టే చేజారిపోతుంటాయి. విమర్శలు, అభియోగాలు ఎదుర్కొంటారు. ఆత్మీయుల ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. దంపతుల ఆలోచనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెట్టుబడులకు అనుకూలం కాదు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, పనిభారం. అధికారులకు ధనప్రలోభం తగదు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2, 3 పాదాలు
అయినవారితో ఉల్లాసంగా గడుపుతారు. బంధుత్వాలు బలపడతాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. రుణ ఒత్తిళ్లు తొలగి కుదుటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. నగదు, పత్రాలు జాగ్రత్త. అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అధికారులకు అదనపు బాధ్యతలు. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం తగదు. ఉపాధిపథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఒక నష్టం మరో విధంగా భర్తీ కాగలదు. సాంకేతిక, న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. 
పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆరోగ్యం, సంతానం భవిష్యత్తు పట్ల శ్రద్ధ వహించండి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. వేడుకలను ఘనంగా చేస్తారు. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. మీ సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆలయాలు, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. భాగస్వామిక చర్చలు కొలిక్కి వస్తాయి. పెట్టుబడులకు అనుకూలం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. విద్యార్థులు మానసికంగా కుదుటపడతారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. ప్రయాణంలో అవస్థలు తప్పవు.
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 
అన్ని రంగాల వారికి శుభదాయకమే. బంధుత్వాలు బలపడతాయి. ప్రముఖులను ఆకట్టుకుంటారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. పెట్టుబడులు, పొదుపు పథకాలు లాభిస్తాయి. పెద్దమొత్తం ధనసహాయం క్షేమం కాదు. ఆర్థిక, కుటుంబ సమస్యలు సర్దుకుంటాయి. ధనలాభం, వస్త్రప్రాప్తి, వాహన యోగం పొందుతారు. ఖర్చులు భారమనిపించవు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. పారిశ్రామికవేత్తలకు అభ్యంతరాలెదురవుతాయి. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
ధనుర్‌రాశి : మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం 
కుటుంబ వ్యవహారాలపై దృష్టి సారిస్తారు. ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. పెద్దల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆర్థికలావాదేవీలతో హడావుడిగా ఉంటారు. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనం మితంగా వ్యయం చేయండి. కుటుంబీకుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆహ్వానాలు, కీలక పత్రాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. కొనుగోలుదార్లు, పనివారలతో జాగ్రత్త. ఆస్తి, భూ వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. దైవకార్యంలో పాల్గొంటారు.
 
మకరరాశి : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. బంధువుల ఆదరణ సంతృప్తినిస్తుంది. వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధనలాభం ఉంది. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. ఖర్చులు సంతృప్తికరం. శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. సంతానం ఉన్నత చదువులపై నిర్ణయానికి రాగలుగుతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. పెట్టుబడులు, పొదుపు పథకాలకు అనుకూలం. పెద్దమొత్తం సాయం తగదు. పరిచయం లేని వారితో జాగ్రత్త. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు పదవీయోగం, బాధ్యతల మార్పు, వ్యాపారాల్లో నష్టాలను భర్తీ చేసుకుంటారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. సరుకు నిల్వలో జాగ్రత్త. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు.
 
కుంభ రాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు.
వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. వివాహ యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కి వస్తాయి. ఒక వ్యవహారంలో ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. ఆత్మీయులు, చిన్నారులకు కానుకలందిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. ప్రియతములతో సంప్రదింపులు జరుపుతారు. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. విద్యార్థులకు ఒత్తిడి, శ్రమ అధికం. వ్యాపారాల్లో పురోభివృద్ధి. అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. దైవకార్యాల్లో ప్రముఖంగా పాల్గొంటారు.
 
మీనరాశి : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి. 
మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. విలువైన పత్రాలు జాగ్రత్త. పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. కొత్త సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. అదనపు రాబడిపై దృష్టి పెడతారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు నిదానంగా సత్ఫలిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. పందాలు, జూదాల జోలికిపోవద్దు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గురువారం మీ దినఫలాలు : దాన ధర్మాలు చేయడం వల్ల