Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవిశ్వాస తీర్మానం.. గల్లా జయదేవ్ స్పీచ్‌కు లైకులే లైకులు..!

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో వీగిపోయింది. అవిశ్వాస తీర్మానంపై 12 గంటల పాటు చర్చ జరిపారు. అనంతరం ఓటింగ్ చేపట్టారు. అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 325 మంది

Webdunia
ఆదివారం, 22 జులై 2018 (16:29 IST)
కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో వీగిపోయింది. అవిశ్వాస తీర్మానంపై 12 గంటల పాటు చర్చ జరిపారు. అనంతరం ఓటింగ్ చేపట్టారు. అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 325 మంది ఓటేశారు. అనుకూలంగా 126 మంది ఓటేశారు. ఓటింగ్ సమయంలో మొత్తం 451 మంది సభలో ఉన్నారు. 
 
అంతకుముందు భరత్ అనే నేను సినిమాను ప్రస్తావిస్తూ, కేంద్ర సర్కారుపై అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించిన గల్లా జయదేవ్ ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆయన నరేంద్ర మోదీని విమర్శించిన తీరుకు లక్షల్లో లైక్స్ వచ్చాయి. ఆయన ప్రసంగాన్ని వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో దాదాపు 80 లక్షల మందికి పైగా వీక్షించారు. గల్లా ప్రసంగానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్‌బుక్, ట్విట్టర్లో రెండున్నర లక్షల లైక్స్, యూట్యూబ్‌లో మూడున్నర లక్షల మంది ఆయన ప్రసంగానికి లైక్స్ కొట్టారు. ఎంపీ జయదేవ్ ప్రసంగాన్ని టీడీపీ శ్రేణులంతా టీవీలకు అతుక్కుపోయి మరీ చూశారు. 
 
టీడీపీకి కేవలం 13 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చినప్పటికీ, దాదాపు గంట సేపు తన ప్రసంగాన్ని కొనసాగించిన జయదేవ్, నరేంద్ర మోదీ సర్కారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని దేశమంతటికీ తెలిసేలా చేశారు. ప్రధాని ఇచ్చిన మాటను తప్పారని ఎత్తి చూపారు. మోసగాడు అంటూ ప్రధానిని ఏకిపారేశారు. భవిష్యత్తులో కాంగ్రెస్‌ పార్టీకి ఏర్పడిన గతే బీజేపీకి ఏర్పడుతుందంటూ శాపనార్థాలు పెట్టారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments