మోదీ సర్కారుపై వీగిపోయిన అవిశ్వాసం... అనుకూలం 126, వ్యతిరేకం 325
ప్రధాని మోదీ సర్కారుపై తెదేపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాసానికి వ్యతిరేకంగా 325 ఓట్లు రాగా అనుకూలంగా 126 ఓట్లు వచ్చాయి. ఇకపోతే అవిశ్వాస తీర్మానంపై నరేంద్ర మోదీ ఇచ్చిన సమాధానంపై కేశినేని నాని మాట్లాడారు. దాదాపు గంటన్నరపాటు ప్ర
Publish Date: Fri, 20 Jul 2018 (23:23 IST)
Updated Date: Fri, 20 Jul 2018 (23:24 IST)
ప్రధాని మోదీ సర్కారుపై తెదేపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాసానికి వ్యతిరేకంగా 325 ఓట్లు రాగా అనుకూలంగా 126 ఓట్లు వచ్చాయి. ఇకపోతే అవిశ్వాస తీర్మానంపై నరేంద్ర మోదీ ఇచ్చిన సమాధానంపై కేశినేని నాని మాట్లాడారు. దాదాపు గంటన్నరపాటు ప్రధానమంత్రి బ్రహ్మాండంగా డ్రామా ఆడారనీ, ప్రపంచంలోని నటులలోకెల్లా ప్రధాని గొప్ప నటుడు అని ఎద్దేవా చేశారు తెదేపా ఎంపీ కేశినేని నాని. గంటలు గంటలు మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాల్సిన హామీలపై స్పష్టత ఇవ్వలేదని అన్నారు. ప్రధాని బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ చూపించారని అనగానే భాజపా నాయకులు అడ్డు తగిలారు. దాంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ ఓటింగ్ నిర్వహించారు.
అంతకుముందు అవిశ్వాస తీర్మానంపై నరేంద్ర మోదీ తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానాన్ని తూర్పారపట్టారు. ప్యాకేజీకి ఓకే చెప్పి ఆ తర్వాత రాజకీయ ప్రయోజనాల కోసం యూ-టర్న్ తీసుకున్నారంటూ విమర్శించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... " తల్లిని చంపి బిడ్డను బయటకు తీసింది కాంగ్రెస్ పార్టీ... ఇంతకుముందు చెప్పా.. ఇప్పుడు కూడా అదే చెపుతున్నాను. పంపకాల వివాదం సాగుతోంది. ప్రత్యేక హోదాను ప్రత్యేక ప్యాకేజీగా మార్చాము.ఏపీ, తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి వున్నాం.
ప్యాకేజీ మంచిదని తెదేపా నాయకుడు ఒకరు చెప్పారు. ఇప్పుడు యూ టర్న్ ఎందుకు తీసుకున్నారు? కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ పని చేశారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు చేశాం. ఎన్డీఏ నుంచి తెదేపా తప్పుకున్నప్పుడు మీరు వైసీపిలో చిక్కుకున్నారని బాబుకు ఫోన్ చేసి చెప్పాను. ఎన్డీఏ ఆంధ్రప్రజల కళ్యాణానికి కట్టుబడి వుంది.
అసలు వివాదం ఏపీలో వుంటే సభలో పోరాడుతున్నారు. ఓటుకు నోటు సంగతి మర్చిపోతారు. నన్ను ప్రధానిగా కూర్చోబెట్టేది 125 కోట్ల మంది ప్రజలు, విపక్ష పార్టీలు కాదు. ఒక్క మోదీని దించేందుకు ప్రయాస పడుతున్నారు. మేం అధికార పక్షంలో వున్నాం. ఈ అవిశ్వాన్ని అందరూ తిరస్కరించాలి అంటూ చెప్పారు.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories....
Read More