Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ తరహాలోనే పవన్ కూడా మిస్డ్ కాల్ పార్టీల జాబితాలో చేరారా..?

సినిమాలో ఇంటర్వేల్ వరకు హీరోలా ఉండి.. ఆ తర్వాత భిన్నమైన రోల్ పోషించినట్టుగా పవన్ వ్యవహరిస్తున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. జగన్ తరహాలోనే పవన్ కూడా మిస్డ్ కాల్ పార్టీల జాబితాలో చేరారా..? వాళ్లను అనుసరిస్తున్నారా..? వైసీపీ కూ

Webdunia
శుక్రవారం, 16 మార్చి 2018 (12:34 IST)
సినిమాలో ఇంటర్వేల్ వరకు హీరోలా ఉండి.. ఆ తర్వాత భిన్నమైన రోల్ పోషించినట్టుగా పవన్ వ్యవహరిస్తున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. జగన్ తరహాలోనే పవన్ కూడా మిస్డ్ కాల్ పార్టీల జాబితాలో చేరారా..? వాళ్లను అనుసరిస్తున్నారా..? వైసీపీ కూడా మిస్డ్ కాల్ ఇస్తే సభ్యత్వం ఇచ్చేస్తోంది. జనసేన కూడా అలాగే చేస్తోంది.

పవన్ తన మనస్సు ఎవరి మీద అయినా పారేసుకుంటాడు. ఆ తర్వాత మూడు నాలుగేళ్లకు ఆరేసుకుంటాడు.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీపై మనసు పారేసుకున్నాడు. ఆ తర్వాత ఆరేసుకున్నాడు. మోడీకి వ్యతిరేకంగా పోరాడతానని.. ఒక్కసారిగా పన్నీరు సెల్వంలా ఎందుకు మారిపోయారో అర్థంకావడం లేదు. నిన్నటివరకు వామపక్ష భావజాలంతో ఉన్న పవన్ పక్షపాత భావజాలానికి చేరుకున్నారు.
 
ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ, మైనారిటీ రిజర్వేషన్లను పెంచుతామన్న కేసీఆర్‌ను పొగుడుతున్న పవన్.. కాపు రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న చంద్రబాబును విమర్శిస్తారా..? ఎన్సీఏఈఆర్ నివేదిక ప్రకారం ఏపీ 19వ స్థానంలో ఉంది. 
ఇదే నివేదిక ప్రకారం గతంలో ఏపీ ఒకటో స్థానంలో ఉంది. ఆవేశంలో జరిగిన ఒకటి రెండు సందర్భాలను ప్రస్తావిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు దాడులు చేస్తున్నారంటూ విమర్శలు చేయడం సరికాదు. 
 
ఒక వార్తా పత్రికలో కథనం వస్తే ఆ కార్యాలయం మీద దౌర్జన్యానికి ప్రయత్నించారు. తమ దాకా పరిస్థితి వస్తే ఎలా ఉంటారో పవన్ ఆలోచించుకోవాలి. మంగళగిరిలో పవన్ ఇంటి నిర్మాణం జరిగే చోట నేనూ ఇల్లు తీసుకుందామంటే ఆరేడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతందన్నారు. కానీ పవన్ కళ్యాణ్‌కు రూ. 40 లక్షలకే ఇచ్చేశారు. సినిమా హీరో మీద మోజుతో తక్కువ రేటుకు ఇచ్చారేమో..?

కాపుల విషయంలో మీరేమన్నా అధ్యయనం చేశారా..? కాపు రిజర్వేషన్లు వద్దని చెప్పడమేనా మీ అధ్యయనం..?
చంద్రబాబు, లోకేష్‌ను విమర్శించడానికేనా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ..? వైసీపీ విమర్శలను.. ఆరోపణలను పవన్ దత్తత తీసుకున్నారా..? అంటూ తీవ్రంగా విమర్శనాస్త్రాలు సంధించారు సోమిరెడ్డి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments