Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బొక్కలున్న మీకు భయం.. నాకు కాదు.. తమాషాలేస్తే...: పవన్ వార్నింగ్

గుంటూరులో జరిగిన పార్టీ అవిర్భావ సభలో తాను చేసిన విమర్శల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు తనపై మాటల దాడి చేయడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన శుక్రవారం గుంటూరు జిల్

Advertiesment
Jana Sena
, శుక్రవారం, 16 మార్చి 2018 (12:10 IST)
గుంటూరులో జరిగిన పార్టీ అవిర్భావ సభలో తాను చేసిన విమర్శల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు తనపై మాటల దాడి చేయడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన శుక్రవారం గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో డయేరియాతో బాధపడుతున్న రోగులను పరామర్శించారు. 
 
ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, టీడీపీతో ఉన్నంత కాలం తనను టీడీపీ మనిషి అన్నారు. టీడీపీపై విమర్శలు గుప్పించగానే బీజేపీ మనిషినంటున్నారు. తన వెనుక బీజేపీ ఉందని, ఆ పార్టీ నేతల ప్రమేయంతోనే తాను టీడీపీని విమర్శించానని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. బొక్కలు (లూప్ హోల్స్), లొసుగులు ఉన్న టీడీపీ వారు కేంద్రానికి భయపడతారేమో తప్ప, తాను ఎవరికీ భయపడబోనని, తలొగ్గనని స్పష్టంచేశారు. పైగా, తనతో తమాషాలేయొద్దనీ, మీరు తనను విమర్శిస్తే, మీకంటే పది రెట్లు బలంగా మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు. 
 
అలాగే, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే విషయంలో ఏ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు. ప్రత్యేక హోదా అంశంపై తెదేపా, వైకాపా నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. అవిశ్వాసం పెట్టే అంశంలో రెండు పార్టీలు తేదీలను ముందుకు, వెనక్కి జరుపుతున్నాయన్నారు. అవిశ్వాస తీర్మానంపై తెదేపా, వైకాపా ఒక్కటయ్యాయని అంటున్నారని.. అక్కడే వారి కుమ్మక్కు అర్థమవుతోందని పవన్‌ వ్యాఖ్యానించారు.
 
అంతేకాకుండా, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే గుంటూరులో అతిసారానికి 14 మంది చనిపోయారన్నారు. ఇంతమంది ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు పట్టించుకోవడం దారుణమన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లలో ఎవరైనా చనిపోతే ఇలాగే ప్రవర్తిస్తారా? అని ప్రశ్నించారు. 48 గంటల్లోగా ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోతే గుంటూరులో బంద్‌‌కు పిలుపునిస్తానని, తానే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్డీయేకు తలాక్.. తలాక్.. తలాక్ అంటూ టీడీపీ ఎంపీల నినాదాలు (వీడియో)