Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం నేరం కాదు.. భార్య చరాస్తి కాదు : సుప్రీంకోర్టు

స్త్రీపురుషులిద్దరు ఇష్టపూర్వక శృంగారాన్ని నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 497 పురాతన చట్టమని.. రాజ్యాంగ సమ్మతమైనది క

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (11:49 IST)
స్త్రీపురుషులిద్దరు ఇష్టపూర్వక శృంగారాన్ని నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 497 పురాతన చట్టమని.. రాజ్యాంగ సమ్మతమైనది కాదని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. సెక్షన్‌ 497 కాలం చెల్లిన చట్టంగా పేర్కొంది.
 
ఐపీఎసీ 497 సెక్షన్‌ చెల్లుబాటుపై సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పును వెలువరించింది. మహిళలకు సమానహక్కులు కల్పించాలన్న స్ఫూర్తికి సెక్షన్‌ 497తో తూట్లు పడుతున్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. మహిళల అసమానతలకు అడ్డుపడే ఏ నిబంధన అయినా రాజ్యాంగపరమైనది కాదని వ్యాఖ్యానించింది. 
 
అందువల్ల ఈ సంబంధాన్ని నేరంగా పరిగణించే ఐపీసీ 497 సెక్షన్‌ను కొట్టివేసింది. ముఖ్యంగా మహిళలను చరాస్తిగా చూడడం సరికాదన్నారు. మహిళలను కూడా పురుషులతో సమానంగా చూడాలిని సుప్రీంకోర్టు సూచన చేసింది.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments