Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమలపై మహిళల ప్రవేశం.. సుప్రీం తీర్పుపై రివ్యూ వేయనున్న కాంగ్రెస్

శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాల పర్వం కొనసాగుతోంది. తాజాగా సుప్రీం కోర్టు తీర్పుపై.. కాంగ్రెస్ రివ్యూ పిటిషన్ వేయాలనే యోచనలో వున్నట్

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (16:13 IST)
శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాల పర్వం కొనసాగుతోంది. తాజాగా సుప్రీం కోర్టు తీర్పుపై.. కాంగ్రెస్ రివ్యూ పిటిషన్ వేయాలనే యోచనలో వున్నట్లు తెలుస్తోంది. 
 
మహిళల ప్రవేశంపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా పిటిషన్‌ వేసే యోచనేదీ లేదని కేరళ ప్రభుత్వం తెగేసి చెప్పింది. ఆలయ వ్యవహారాలు చూసుకునే ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) కూడా సుప్రీంకోర్టు తీర్పు పునః పరిశీలన కోరే అంశంపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.
 
అంతేగాకుండా.. శబరిమలలో మహిళలకు స్నానాల కోసం ప్రత్యేక ఘాట్లు, బస్సుల్లో ప్రత్యేక సీట్ల కేటాయింపు, రాత్రి పూట భద్రత కోసం లైట్ల సంఖ్యను పెంచడం, మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్ల ఏర్పాటు వంటి సదుపాయాలను కల్పించే యోచనలో కేరళ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పుపై రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రమేశ్‌ చెన్నితాల శుక్రవారం నిరాహార దీక్ష చేయనున్నారు. 
 
ఈ మేరకు దీనిపై ట్రావెన్‌కోర్ మాజీలతో సమావేశం జరుగనుంది. ట్రావెన్‌కోర్‌ దేవస్థానం‌ బోర్డు‌(టీడీబీ) అధ్యక్షులు, మాజీ సభ్యులు, గురువాయూరు, కొచ్చి దేవస్థానం బోర్డు సభ్యులందరూ ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో రివ్యూ పిటిషన్‌కు సంబంధించి తుది నిర్ణయం వీరే తీసుకుంటారు.
 
కేపీసీసీ అధ్యక్షుడైన ముల్లప్పల్లి రామచంద్రన్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అయిన రమేశ్‌ కూడా పాల్గొననున్నారు. సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్‌, మహిళలు ఆలయంలోకి ప్రవేశిస్తే భవిష్యత్తులో సంభవించే పరిణామాలు, రమేశ్‌ నిరాహార దీక్షకు మద్దతు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments