పెంపుడు కుక్కపై కత్తి పెట్టి... యజమాని కూతురు బట్టలు విప్పమన్న డ్రైవర్

యజమాని కూతురినే లైంగికంగా వేధించడంతో పాటు తను చెప్పినట్లు చేయకపోతే తల్లిదండ్రులను చంపేస్తానంటూ బాలికను బెదిరిస్తున్న డ్రైవర్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (15:36 IST)
యజమాని కూతురినే లైంగికంగా వేధించడంతో పాటు తను చెప్పినట్లు చేయకపోతే తల్లిదండ్రులను చంపేస్తానంటూ బాలికను బెదిరిస్తున్న డ్రైవర్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్నాడు ఓ సాప్ట్వేర్ ఇంజినీర్.
 
రెండేండ్లుగా ఆ ఇంట్లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు షేక్ ఇస్మాయిల్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుమార్తె ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. బాలిక ఓంటరిగా ఉన్న సమయంలో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు ఇస్మాయిల్. ఇటీవల బాలిక కాలేజ్ నుంచి కారులో ఒంటరిగా వస్తున్న సమయంలో డ్రైవర్ ఇస్మాయిల్ ఓ చీకటి ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించగా బాలిక గట్టిగా కేకలు వేయడంతో  వదిలేశాడు. అయితే జరిగిన విషయాన్ని ఇంట్లో చెబితే నీ తల్లిదండ్రులను చంపేస్తా అంటూ బెదిరించాడు.
 
బాలికకు వీడియో కాల్ చేసి ఆమె పెంపుడు కుక్కపిల్ల మెడపై కత్తి పెట్టి బట్టలు తీయాలంటూ ఒత్తిడి తెచ్చాడు. దాంతో తీవ్ర ఆందోళనకు గురైన బాలిక ఇస్మాయిల్ చెప్పినట్లు చేసింది. ఈ వీడియోను రికార్డు చేసిన ఇస్మాయిల్ తాను చెప్పినట్లు చేయాలని లేదంటే సోషల్‌ మీడియాలో ఆ వీడియో పెడతానని బెదిరిండాడు.

అయితే కొంతకాలంగా ఆ బాలిక తీవ్ర మనోవేదనకు గురికావడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి నిలదీయగా జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో బాధితురాలి తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, నిందితుడిపై, నిర్భయ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం