Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదేళ్ల చిన్నారిపై ఆలయంలో పూజారుల అత్యాచారం.. మిఠాయి ఇచ్చినా.. నొప్పితో?

దేశంలో అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కామాంధులు వయోబేధం లేకుండా మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. చిన్నారులు రోడ్డుపై కనిపిస్తే చాలు.. ఎత్తుకెళ్లి.. అత్యాచారానికి పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతో

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (15:21 IST)
దేశంలో అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కామాంధులు వయోబేధం లేకుండా మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. చిన్నారులు రోడ్డుపై కనిపిస్తే చాలు.. ఎత్తుకెళ్లి.. అత్యాచారానికి పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఓ చిన్నారిపై కన్నేసిన ఇద్దరు నీచ పూజారులు ఆలయంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.


మిఠాయిల ఆశచూపి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని మిఠాయిలు ఇచ్చి ఇంటి దగ్గర దిగబెట్టారు. అయితే బాలిక నొప్పితో బాధపడటంతో తల్లిదండ్రులు ఆరా తీయగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌లోని దాతియా జిల్లాలో ఓ బాలిక(5)పై ఊరిలోని గుడి పూజారులు రాజు పండిత్(55), బతోలీ ప్రజాపతి(45) కన్నేశారు. మిఠాయిలు కొనిస్తామని ఆశ చూపి ఆలయంలోకి తీసుకెళ్లారు.

అనంతరం అత్యాచారం చేశారు. ఈ ఘటన తర్వాత బాధితురాలు ఏడుస్తూ ఉండటంతో మిఠాయిలు కొనిచ్చి ఇంటి వద్ద దించారు. కానీ బాలిక నొప్పితో విలవిల్లాడుతూ ఉండటంతో తల్లి ప్రశ్నించింది. దీంతో అసలు విషయాన్ని బాలిక బయటపెట్టింది. దీంతో వెంటనే చిన్నారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. 
 
ఈ నేపథ్యంలో నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసిన పోలీసులు అరెస్ట్ చేశారు.  12 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసు మహిళలపై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష విధించే చట్టాన్ని గతేడాది డిసెంబర్‌లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

మరి ఈ కామాంధులకు మరణశిక్ష తప్పదని మహిళా సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

అఖిల్, నాగ చైతన్య వివాహాలు ఒకే వేదికపై జరుగుతాయా? నాగ్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments