సోనియమ్మ కాళ్ళు మొక్కుతానంటున్న ధర్మపురి శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌కు ఇప్పటికి జ్ఞానోదమైంది. ఆయన తిరిగి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరాలని నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌కు ఇప్పటికి జ్ఞానోదమైంది. ఆయన తిరిగి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఆయన కాంగ్రెస్‌ను వీడి తెరాసలో చేరిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆయనకు రాజ్యసభ సభ్యత్వాన్ని తెరాస అధినేత కేసీఆర్ కల్పించారు.
కానీ, తెరాసలో ఆయన ఇమడలేక పోయారు. ముఖ్యంగా, నిజామాబాద్ జిల్లాలో తెరాస గ్రూపు రాజకీయాలను ఆయన తట్టుకోలేక పోయారు. ఫలితంగా గత కొన్ని రోజులుగా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. అదికూడా శ్రీనివాస్ దసరాలోపు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశముంది.
పలు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో తలమునకలైన పార్టీ అధ్యక్షుడు రాహుల్ దసరాలోపు ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చేలా ఉన్నారు. డీఎస్ వెంటనే ఢిల్లీ వెళ్లి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అనంతరం ఇంకా నాలుగున్నరేళ్ల కాలం ఉన్నా.. తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయనున్నారు. పార్టీలో చేరగానే ధర్మపురి శ్రీనివాస్‌కు కమిటిలో కీలక పదవి లభిస్తుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఆ తర్వాత మాజీ అధినేత్రి సోనియా గాంధీ వద్దకు వెళ్లి ఆమెకు క్షమాపణలు చెప్పాలని డీఎస్ భావిస్తున్నట్టు సమాచారం.