రష్యా బాంబు దాడిలో భారతీయ వైద్య విద్యార్థి మృతి

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (15:43 IST)
ఉక్రెయిన్‌పై రష్యా భీకర యుద్ధం చేస్తుంది. గత ఆరు రోజులు సాగుతున్నప్పటికీ ఉక్రెయిన్‌లు అంగుళం కూడా భయపెట్టలేక పోతోంది. దీంతో రష్యా అధినేత పుతిన్ మరింత కఠినతరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉక్రెయిన్ దేశ రాజధాని కీవ్‌ నగరంలోని ప్రభుత్వ భవాలను లక్ష్యంగా చేసుకుని రాకెట్ దాడులు చేస్తున్నారు. మంగళవారం జరిపిన రాకెట్ దాడిలో కర్నాటక రాష్ట్రానికి చెందిన నవీన్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ అధికారికంగా వెల్లడించింది. ఈ విద్యార్థి ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు. 
 
కాగా, ఉక్రెయిన్ దేశంలో వైద్య కోర్సును చదివేందుకు వేలాది మంది భారతీయ విద్యార్థులు వెళ్లివున్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది విద్యార్థులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఈ విద్యార్థులతో పాటు.. భారతీయ పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రత్యేక విమానాలను సైతం నడుపుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం రష్యా బలగాలు ఖార్కివ్ నగరంపై జరిపిన బాంబు దాడిలో నవీన్ అనే వైద్య విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీ తల్లిదండ్రులను - దేవుడుని ఆరాధించండి : శివకార్తికేయన్

బాధితురాలిగా విలన్ భలే యాక్ట్ చేసింది: సమంత మాజీ మేకప్ ఆర్టిస్ట్ సాధన పోస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments