ఓర్వకల్లులో రోజా.. ఫోటోలు నెట్టింట వైరల్

Webdunia
శనివారం, 21 మే 2022 (17:39 IST)
Roja
ఏపీ టూరిజం మంత్రి రోజా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో పర్యటించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద ఉన్న రాక్ గార్డెన్స్‌కు విచ్చేశారు. తన పర్యటనకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్‌లో వెల్లడించారు. 
 
ఈ రాక్ గార్డెన్స్ కర్నూలు నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కర్నూలు నుంచి నంద్యాల వెళ్లే రహదారి పక్కనే ఓర్వకల్లుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఇది కొలువై ఉంది.
 
ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో రాతి రెస్టారెంట్, కేవ్ మ్యూజియం, బోటింగ్, పిక్నిక్ స్పాట్లు, హరిత రిసార్టు ద్వారా వసతి అందిస్తున్నట్టు రోజా వెల్లడించారు. ఓర్వకల్లు రాక్ గార్డెన్స్ పర్యాటక ప్రదేశంగా చాలా అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నారు. 
 
రాక్ గార్డెన్స్ ప్రాంతం పర్యాటకం పరంగానే కాకుండా, సినిమా షూటింగులకు కూడా ఎంతో అనువుగా ఉంటుంది. ఇక్కడ గతంలో జయం మనదేరా, టక్కరిదొంగ, సుభాష్ చంద్రబోస్, బాహుబలి వంటి సినిమాలను చిత్రీకరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ది తో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుంది : శివరాజ్ కుమార్‌

Vaishnavi : ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ నుండి ప్రియసఖి మెలోడీ గీతం విడుదల

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

తర్వాతి కథనం
Show comments