విజయదశమికి లక్ష్మీస్ ఎన్టీఆర్‌.. శ్రీవారి పాదాలచెంత..?: వర్మ

తాజాగా ముంబైకి చెందిన ఎంటర్ ప్రెన్యూర్ బాలగిరికి చెందిన జీవీ ఫిలిమ్స్ బ్యానర్‌పై రాకేష్ రెడ్డి నిర్మాణంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ రూపొందిస్తామని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు

Webdunia
శుక్రవారం, 12 అక్టోబరు 2018 (18:53 IST)
నందమూరి బాలకృష్ణ తన స్వీయ నిర్మాణంలో ఎన్టీఆర్ పేరుతో రెండు భాగాలుగా తన తండ్రి బయోపిక్ రూపొందించే పనిలో పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన చేశాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించబోతున్నట్లు గతంలో ప్రకటించారు. ఆ తర్వాత ఈ సినిమాపై వివరాలను ఆర్జీవీ ప్రకటించలేదు. 
 
తాజాగా ముంబైకి చెందిన ఎంటర్ ప్రెన్యూర్ బాలగిరికి చెందిన జీవీ ఫిలిమ్స్ బ్యానర్‌పై రాకేష్ రెడ్డి నిర్మాణంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ రూపొందిస్తామని ప్రకటించారు. విజయదశమికి ఈ సినిమాను ప్రారంభించి.. జనవరి చివరికల్లా షూటింగ్ పూర్తి చేస్తామని చెప్పారు. అక్టోబర్ 19న పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈ మేరకు ఎన్టీఆర్, లక్ష్మిపార్వతి, చంద్రబాబు నాయుడు‌లతో కూడిన పాత పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఎన్టీఆర్ ట్రూ స్టోరీ అనే హ్యాష్‌‌ట్యాగ్‌ను జోడించారు. 
 
అంతేగాకుండా.. తొలిసారి తన సినీ కెరీర్‌లో ముహూర్తం చూసుకుని, ఖరారు చేసుకుని ప్రారంభిస్తున్న సినిమా ఇదని ఆర్జీవీ ట్వీట్ చేశారు. అది కూడా కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతిలో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆర్జీవీ వ్యాఖ్యానించారు. అంతేగాకుండా.. ఎన్టీఆర్‌పై వున్న గౌరవంతో ఆ పనిచేస్తున్నానని ఆర్జీవీ వ్యాఖ్యానించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyadarshi: ప్రియదర్శి, సాయి కుమార్ ల సుయోధన చిత్రం సిద్ధమైంది

Allu Arjun 23: అల్లు అర్జున్ 23 చిత్రం స్పెషల్ థీమ్ సాంగ్ ర్యాంపేజ్

పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసుకుని విడుదలకి సిద్ధమైన సందిగ్ధం

Mark K Robin: గద్దర్ పాటలు కాదు ఫైర్ - ఆయన పేరుతో అవార్డు రావడం ఆనందంగా వుంది : మార్క్ కె రాబిన్

గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా హర్షిత్ రెడ్డి దీవాన మూవీ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కడుపులో మంటగా ఉందా?

షార్లెట్‌లో నాట్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

నెలసరి సమయంలో కడుపునొప్పి, తగ్గించే చిట్కాలు

కుండనీరు తాగితే ఏంటి లాభం.. తెలుసుకుందామా?

వేసవిలో గర్భిణీస్త్రీలు ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments