Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కనకదుర్గమ్మ నవదుర్గలుగా అవతరించడానికి గల కారణమేమిటి?

కనకదుర్గమ్మ నవదుర్గలుగా అవతరించడానికి గల కారణమేమిటి?
, బుధవారం, 10 అక్టోబరు 2018 (13:34 IST)
దసరా నవరాత్రుల్లో కనకదుర్గమ్మ అమ్మవారి అంశ అయినటువంటి తొమ్మిది అవతారాలను భక్తితో పూజించే వారికి ఆ తల్లి కటాక్షం తప్పకుండా లభిస్తుంది. మిగతా రోజుల కంటే పండుగ సందర్భాలలో అమ్మవారు ప్రసన్నంగా ఉంటారట. ఆ తల్లిని మనఃపూర్వకమైన భక్తితో పూజిస్తే సకల అబీష్టాలు నెరవేరుతాయి. కనకదుర్గమ్మ నవదుర్గలుగా అవతరించడానికి గల కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
పూర్వం దేవతలు భండాసురడనే రాక్షసుని బారి నుండి తమను రక్షించుకొనుటకు ఆ ఆదిపరాశక్తిని తలచి మహాయజ్ఞాన్ని నిర్వహించారు. ఆ యజ్ఞగుండములో వారివారి శరీర భాగాలను ఖండించుకుని ఆహుతి చేశారు. దీనికి ఆ జగన్మాత సంతసించి కోటి సూర్యకాంతులతో ప్రత్యక్షమై వారికి అభయమిచ్చి భండాసురుని సంహరించి దేవతల అభీష్టాన్ని నెరవేర్చింది. ఆ దేవదేవి పాడ్యమి మొదలు నవమి వరకు ఒక్కోరోజు ఒక్కో రాక్షసుని వధించసాగింది. ఆ శక్తి నుంచి వివిధ శక్తులు నవదుర్గలుగా అవతరించారు. 
 
వారిలో 1. శైలపుత్రి 2. బ్రహ్మచారిణి 3. చంద్రఘంట 4. కూష్మాండ 5. స్కందమాత 6. కాత్యాయనీ 7. కాళరాత్రి 8. మహాగౌరి 9. సిద్ధిరాత్రి అను రూపాలతో ఆ తల్లీ ఆరాధనలు అందుకోసాగింది.తొలుత ఈ దేవదేవి "శ్రీ కృష్ణ పరమాత్మ"చే గోకులం, బృందావనములలో పూజలందుకుందని పురాణాలు చెపుతున్నాయి. 
 
"బ్రహ్మ" కైటభుల బారి నుండి రక్షించుకోవడం కోసం అమ్మలగన్న అమ్మను స్తుతించి విముక్తి పొందాడని, 'పరమేశ్వరుడు' త్రిపురాసుర సంహార సమయమందు ఈ జగన్మాతను ఆరాధించి విజయం సాధించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అలాగే దేవేంద్రుడు దూర్వాసుని శాపంవల్ల సంపదలన్నీ సముద్రంలో కలిసిపోగా.. ఈ పరాశక్తి సేవించి తిరిగి సంపదల్ని పొందగలిగినాడని చెప్పబడింది.
 
అలాంటి మహామహులు, దేవతలు, సిద్ధులే ఆమెను నిష్టతో ప్రార్థించి తమ అభిష్టాలను తీర్చుకోగలిగారు. అందుచేత మనం కూడా ఆ దేవదేవిని మనసారా స్తుతించి అమ్మవారి అనుగ్రహం పొందుదాం. ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి, హస్తానక్షత్రములో కూడియున్న శుభదినాన ఈ దేవీ పూజ ప్రారంభించడం చాలా మంచిదని మార్కండేయ పురాణం చెబుతోంది. అందువల్ల ఈ రోజు నుంచి నవరాత్రులు ప్రారంభిస్తారు. అందులో మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలని చెప్పబడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవరాత్రి ఉత్సవాలు.. తొలిరోజున శైలిపుత్రిని మల్లెలతో పూజిస్తే..?