సాధారణంగా వంటింట్లో వంట చేసేటప్పుడు కడాయిపై నూనె కాగుతుంటే జాగ్రత్త అంటూ చెబుతుంటాం. వంట చేసేటప్పుడు నూనె ఒక్క చుక్క శరీరంపై పడితే ఓళ్ళు కాలినట్లు అనిపిస్తుంది. కానీ ఈ దృశ్యాన్ని చూడండి. సల సల కాగుతున్న నూనెలో రెండు చేతులు పెట్టి అందులో ఉడికిన వడలను ప్లేట్ లోకి వేస్తుంటారు అర్చకులు.
ఇదంతా ఎక్కడో కాదు కర్ణాటకలో దసరా ఉత్సవాల సంధర్భంగా జరుగుతుంది. వడసేవ పేరుతో కర్ణాటక రాష్ట్రంలోని కొన్ని ఆలయాల్లో దసరా ఉత్సవాల్లో వడలను ఇలాగే చేసి అమ్మవారికి నైవేథ్యంగా సమర్పిస్తారు. నూనె ఎంత వేడిగా ఉన్నా ఎవరికీ చేతులు కాలవు. అదే అమ్మవారి మహిమ.