పెళ్లికి అంగీకరించని పెద్దలు... ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమజంటలు

Webdunia
సోమవారం, 2 డిశెంబరు 2019 (13:44 IST)
రంగారెడ్డి జిల్లాలోని రెండు గ్రామాల్లో విషాదం చోటుచేసుకుంది. వేర్వేరుచోట్ల రెండు ప్రేమ జంటలు ఆత్మహత్య చేసుకున్నాయి. కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించలేదన్న కారణంతో బలవన్మరణానికి పాల్పడ్డాయి. షాబాద్‌ మండలం లింగారెడ్డి గూడలో ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని మనస్తాపం చెందిన యువ జంట చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రామానికి చెందిన పల్లవి (19), ఆశమల్ల మహేందర్‌ (21) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వారి ప్రేమ విషయం ఇంట్లో తెలిస్తే అంగీకరించరేమోనని తీవ్ర మనస్తాపానికి గురై గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 
మరోవైపు కేశంపేట మండలం తొమ్మిది రేకుల గ్రామంలోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లికి అంగీకరించలేదని మనస్తాపం చెంది గ్రామానికి చెందిన సుశీల (20) అనే యువతి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

విషయం తెలుసుకున్న ఆమె ప్రియుడు శ్రీరాములు (25) కూడా పొలంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై కోన వెంకటేశ్వర్లు మృతదేహాలకు పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్లి చేసుకునేందుకు సరైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నా : శ్రీముఖి

Kajal Aggarwal: సాక్షుల బోనులో పురుగుమందు సిలిండర్ తో లాయర్ కాజల్ అగర్వాల్..ది ఇండియా స్టోరీ

Singeetham: 40 ఏళ్ల కలని సక్సెస్ చేసిన ఘనత నాగ్ అశ్విన్ గారిదే : సింగీతం శ్రీనివాసరావు

Natti Kumar: పర్సంటేజ్ సబ్ కమిటీ నుంచి సురేష్ బాబు, దిల్ రాజు తప్పుకోవాలి : నట్టికుమార్

Arnold Vosloo: రణబాలి సినిమాలో ది మమ్మీ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ లుక్

తర్వాతి కథనం
Show comments