Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా మాజీ ప్రియురాలు కష్టాల్లో వుంది, నేను ఆదుకోలేనా?

Advertiesment
Ex-girlfriend
, బుధవారం, 20 నవంబరు 2019 (20:53 IST)
ఇంటర్ చదివే రోజుల నుంచి ఆమె నేను ప్రేమించుకున్నాం. డిగ్రీ పూర్తయ్యేవరకూ ముద్దులు, కౌగలింతలు వరకే ఉన్నాం. ఒకరోజు ఆమె ఏదో ఓ ఫంక్షన్ కోసమని చీర కట్టుకుని వచ్చింది. ఆమెనలా చూసేసరికి నేను ఆగలేకపోయాను. ఎంతో అందంగా ఉంది. ముద్దులు, కౌగిళ్లతోపాటు ఒక్కసారి శృంగారంలో పాల్గొందామని బ్రతిమాలాను. చివరికి ఒప్పుకుంది. కానీ కండోమ్ ధరించాలని కండిషన్ పెట్టింది. అలాగే మరుసటి రోజు ఇద్దరం పాల్గొన్నాం. ఎంతో తృప్తి కలిగింది.
 
అది జరిగిన రోజు నుంచి ఆమె కాలేజీకి రావడం మానేసింది. ఏంటని ఫోన్ చేస్తే వాళ్లింట్లో కాలేజీకి వద్దని చెప్పేశారని తెలిపింది. ఆ తర్వాత తనే ఫోన్ చేస్తాననీ, నన్ను చేయవద్దని చెప్పింది. అలాగే ఎప్పుడో వారానికోసారి ఫోన్ చేస్తూ ఉండేది. మా స్నేహం అలా సాగింది. కానీ ఏడెనిమిది నెలల క్రితం అకస్మాత్తుగా పెళ్లి కుదిరిపోయిందనీ, పెద్దవాళ్ల ఒత్తిడి వల్ల పెళ్లి కూడా చేసేసుకున్నానని చెప్పింది. 
 
అలా ఎందుకు చేశావు... మనిద్దరం చేసుకుందామని అనుకున్నాం కదా అంటే, తన పేరెంట్స్‌కి ఎదురుచెప్పలేకపోయానంది. ఆ తర్వాత ఇక ఫోన్ చేయలేదు. కానీ ఈమధ్య మళ్లీ ఫోన్ చేసి, మనిద్దరి సంబంధం మా ఆయనకు తెలిసిపోయిందనీ, అందువల్ల నన్ను చితకబాదుతున్నాడనీ, నాకు ఏదోవిధంగా సహాయం చేయాలనీ, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని ఏడుస్తోంది. ఆమెకు నేనెలా సహాయపడగలనో అర్థం కావడంలేదు... ఏం చేయమంటారు?
 
ప్రేమించుకునేటప్పుడు ఉన్న ధైర్యం ఆ తర్వాత మీ ఇద్దరిలోనూ లేదని చెప్పవచ్చు. ఆమె చదువు మాన్పించి ఇంట్లో కూర్చోపెట్టినప్పుడే మీ వ్యవహారం వారింట్లో తెలిసిపోయింది. కానీ ఆ తర్వాత మీరు ఆమె ఫోన్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు తప్పించి, ఆమెను పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రుల వద్ద చెప్పలేదు. సెక్స్ కోర్కె తీర్చుకునేందుకు పడిన ఆరాటం పెళ్లి విషయంలో మీరు పడలేదని అర్థమవుతుంది.
 
ఇక, ఇప్పుడు ఆమె వేరొకరి భార్య. ఇప్పుడు ఆమె జీవితంలో ప్రత్యక్షంగా మీరు ఎలాంటి పాత్ర పోషించినా అది ఇద్దరికీ మంచిది కాదు. కాబట్టి ఆమెను రక్షించేందుకు మహిళా సంఘాల వారికి ఆమె సమస్యను వివరిస్తూ లేఖ రాయండి. అందులో మీ చిరునామా చేర్చవద్దు. అలాగే ఆమె తల్లిదండ్రులకు కూడా విషయాన్ని ఇలాంటి లేఖ ద్వారానే చేరవేయండి. అంతకుమించి ఆమె విషయంలో ప్రత్యక్షంగా మీరు ఈ స్థితిలో ఏమీ చేయలేరు. ఒకవేళ జోక్యం చేసుకుంటే ఇపుడున్న అనర్థాన్ని మించి మరిన్ని అనర్థాలు జరగవచ్చు. పరిస్థితి మరీ శ్రుతిమించుతుందనిపిస్తే ఆమె పెద్దల వద్దకు నేరుగా ఈ సమస్యను తీసుకెళ్లండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్త్రీ ప్రియురాలిగా ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది?