Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజశేఖర్ ప్లీజ్... ఇటువైపు రావొద్దు, నాకు టెన్షన్ వస్తోంది: మెగాస్టార్ చిరంజీవి

Webdunia
గురువారం, 2 జనవరి 2020 (17:34 IST)
మా అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ సభలో నటుడు రాజశేఖర్ వ్యాఖ్యలు రసాభాస చేశాయి. సభకు విచ్చేసిన చిరంజీవి మాట్లాడుతున్న సమయంలో రాజశేఖర్ అటుగా వస్తుండగా ఆయన్ని చూసిన చిరంజీవి, రాజశేఖర్ ప్లీజ్... ఇటువైపు రావొద్దు, నాకు టెన్షన్ వస్తోంది అని వ్యాఖ్యానించడంతో సభలో నవ్వులే నవ్వులు. 
 
మరోవైపు ఎంత సముదాయిద్దామని అనుకున్నా... జీవిత-రాజశేఖర్ దంపతులు మాత్రం తాము ఏమి అనుకుంటున్నారో అది చెప్పకుండా మైకును వదిలిపెట్టలేదు. అంతకుముందు చిరంజీవి చెప్పిన మాటలపై రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు సభలో రచ్చగా మార్చేశాయి. వాటిపై మా సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా, ఆ తర్వాత మైకు అందుకున్న మా కార్యదర్శి జీవిత కూడా కాదుకాదంటూనే మాట్లాడారు. 
 
తన భర్త రాజశేఖర్‌ది ఓ చిన్నపిల్లవాడి మనస్తత్వమనీ, మనసులో ఏదీ దాచుకోలేడనీ, అతడితో సంసారం చేసే తనకు ఈ విషయం తెలుసుననీ చెప్పుకొచ్చారు. చిరంజీవి, మోహన్ బాబు తదితర సినీ పెద్దల సమక్షంలో ఆమె కలిసి వుందామని చెపుతూనే భర్త రాజశేఖర్ వ్యాఖ్యలను సమర్థించే ప్రయత్నం చేశారు. 
 
ఆమె మాట్లాడుతూ వుండగానే మోహన్ బాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ మా డైరీ ఎంతో హుందాగా జరుపుదామనుకున్న సినీ పెద్దలకు జీవిత-రాజశేఖర్‌లు చేదు గుళికలను అయితే మింగించారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments