Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ప్రధాని మోదీ శంకుస్థాపన: క్రికెట్ దిగ్గజాలు హాజరు

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2023 (21:27 IST)
కర్టెసి-సోషల్ మీడియా
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని గంజరిలో తొలి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ స్టేడియాన్ని రూ.450 కోట్లతో 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. స్టేడియం కోసం భూమిని సేకరించేందుకు రూ.121 కోట్లు వెచ్చించగా, బీసీసీఐ దీని నిర్మాణానికి రూ.330 కోట్లు ఖర్చు చేయనుందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఈ స్టేడియం డిసెంబర్ 2025 నాటికి పూర్తయ్యే అవకాశం ఉన్నది.
 
ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, దిలీప్ వెంగ్‌సర్కార్, మదన్ లాల్, గుండప్ప విశ్వనాథ్, గోపాల్ శర్మ, రవిశాస్త్రిలతో పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరితో పాటు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, సెక్రటరీ జే షా తదితరులు పాల్గొన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను వస్తున్నా.. ఆశీస్సులు కావాలంటూ నందమూరి మోక్షజ్న ట్వీట్

పుష్ప 2 కు అన్నీ అడ్డంకులే.. ముఖ్యంగా ఆ ఇద్దరే కారణమా?

ముంబైలో చెర్రీ ఇంట్లోనే వుండిపోయా.. ఎవరికీ చెప్పొద్దన్నాడు.. మంచు లక్ష్మి

రామ్ చరణ్ సమర్పణలో నిఖిల్ హీరోగా ది ఇండియా హౌస్ చిత్రం హంపిలో ప్రారంభం

భార్య విడాకులు.. సౌదీ యూట్యూబర్‌తో నటి సునైనా నిశ్చితార్థం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments