ఎవరు.. ఎవరితో పడుకున్నా పవనే ఆన్సర్ చెప్పాలా.. నా బతుకిలా అయిపోయింది...

జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పేరును ప్రస్తావించకుండానే పరోక్షంగా ఆయన్ను టార్గెట్ చేశారు. ఈ మీడియా ఇలాంటి ర

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (08:57 IST)
జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పేరును ప్రస్తావించకుండానే పరోక్షంగా ఆయన్ను టార్గెట్ చేశారు. ఈ మీడియా ఇలాంటి రౌడీ వెధవలపై స్టింగ్ ఆపరేషన్ చేయొచ్చు కదా అని వ్యాఖ్యానించారు. అలా చేయడం వదిలివేసి... పవన్ కళ్యాణ్‌పైనే ఫోకస్ పెడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు.
 
వెస్ట్ గోదావరి జిల్లా దెందులూరులో పవన్ కళ్యాణ్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ టార్గెట్‌గా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీడియాపై కూడా పవన్ సెటైర్లు సంధించారు. 
 
ఈ మీడియా కేవలం పవన్ అనే వ్యక్తిపైనే ఎందుకు ఫోకస్ పెడుతుందో అర్థం కావడం లేదన్నారు. 'ఎవరు ఎవరితో పడుకున్నా పవనే సమాధానం చెప్పాలి.. నా బతుకిలా అయిపోయింది' అని ఆయన వ్యాఖ్యానించారు. 
 
'మీరూ.. మీరూ పడుకుంటే నేనేం చేయాలని' పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దానిపైన ప్రోగ్రాంలు, ఆరు నెలలు.. సంవత్సరం నడుపుతూ టీఆర్‌పీలు పెంచుకుంటున్నారని మీడియాపై పవన్ విమర్శలు చేశారు. మరి ఇలాంటి రౌడీల గురించి ప్రోగ్రాం ఎందుకు చేయరని ప్రశ్నించిన పవన్.. అలాంటి వాళ్లంటే మీడియాకు భయమని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్

మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్‌ ప్రీత్ కౌర్

మగాడిపై సానుభూతి కలిగించేలా పురుష: నుంచి కీరవాణి పాట

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న చిత్రం వీడీ 14 టైటిల్ ప్రకటన

స్వయంభు కోసం టాప్ విఎఫ్ఎక్స్ కంపెనీలు ముందుకు వచ్చాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments