Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతరిక్షంలో ఉపగ్రహాన్ని పేల్చిన భారత్... ఉలిక్కిపడిన చైనా-పాక్

Webdunia
బుధవారం, 27 మార్చి 2019 (18:56 IST)
కేవలం 3 నిమిషాల్లోనే 300 కిలోమీటర్ల ఎత్తులో వున్న ఉపగ్రహాన్ని తునాతునకలు చేసింది మిషన్ శక్తి. దీనిపై ప్రధానమంత్రి మోదీ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. అంతరిక్షంలో ఉపగ్రహాన్ని దిగ్విజయంగా ఢీకొట్టడం ద్వారా భారతదేశం అగ్రదేశాల సరసన చేరిందన్నారు. తమ ప్రయోగం ఏ దేశాన్ని ఉద్దేశించింది కాదన్నారు. మిషన్ శక్తి సక్సెస్‌తో భారత్ అంతరిక్షంలో మహాశక్తిగా ఎదిగిందన్నారు.
 
భారతదేశం ప్రయోగించిన యాంటీ శాటిలైట్ విషయం తెలియగానే పాకిస్తాన్-చైనాలు ఉలిక్కిపడ్డాయి‌. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ... అంతరిక్షం అందరిది.. అక్కడ కూడా ఇలాంటి విన్యాసాలు తగవని భారతదేశం పేరును ప్రస్తావించకుండా సన్నాయినొక్కులు నొక్కారు. చైనా స్పందిస్తూ... ఎలాంటి పరీక్షలు చేసినా ప్రపంచంలోని అన్ని దేశాలు శాంతియుతంగా వుండాలన్నదే తమ అభిమతం అని పేర్కొంది.
 
కాగా మిషన్ శక్తిని ప్రయోగించి విజయవంతం చేయడం ద్వారా భారతదేశం అగ్ర రాజ్యాలైన అమెరికా, ర‌ష్యా, చైనా దేశాల‌ సరసన చేరింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments