Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాస్టింగ్ కౌచ్‌కు పార్లమెంట్ అతీతమని భావించకండి: రేణుకా చౌదరి

టాలీవుడ్ సినీ రంగాన్ని క్యాస్టింగ్ కౌచ్ వివాదం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. సినీ రంగంలోనే ఇలాంటి వ్యవహారాలు నడవట్లేదని.. అన్నీ రంగాల్లోనూ మహిళలపై లైంగిక వేధింపులు చోటుచేసుకుంటున్నాయని వార్తలొస్త

Webdunia
మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (16:05 IST)
టాలీవుడ్ సినీ రంగాన్ని క్యాస్టింగ్ కౌచ్ వివాదం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. సినీ రంగంలోనే ఇలాంటి వ్యవహారాలు నడవట్లేదని.. అన్నీ రంగాల్లోనూ మహిళలపై లైంగిక వేధింపులు చోటుచేసుకుంటున్నాయని వార్తలొస్తున్న తరుణంలో క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినీ పరిశ్రమలో మాత్రమే కాకుండా.. అన్నీ చోట్లా వుందని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. 
 
సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌పై బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యపై రేణుక స్పందిస్తూ.. క్యాస్టింగ్ కౌచ్‌కు పార్లమెంట్ అతీతమని భావించకండని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై దేశమంతా ఒక్కతాటిపైకి వచ్చి పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. పార్లమెంట్‌లో మహిళా సాధికారత పెరగాలని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు.  
 
కాగా సినీ ఇండస్ట్రీలో ఎవర్నీ వాడుకుని వదిలేయలేదని క్యాస్టింగ్ కౌచ్ వల్ల కొందరికి జీవనోపాధి లభిస్తోందని.. సరోజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. సరోజ్ ఖాన్ వ్యాఖ్యల పట్ల పలువురు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో.. వెనక్కి తగ్గిన సరోజ్ ఖాన్ క్షమాపణలు తెలిపారు. ఇక క్యాస్టింగ్ కోచ్‌పై పోరుబాట పట్టిన శ్రీరెడ్డి కూడా సరోజ్ ఖాన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం