"నీట్" ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (14:10 IST)
దేశంలో వైద్య విద్యా కోర్సుల ప్రవేశానికి నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.టి.ఏ) ప్రకటించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య కోర్సుల ప్రవేశాల కోసం జూలై 17వ తేదీన నీట్ పరీక్ష నిర్వహించనుంది. ఆ రోజున మధ్యాహ్నం 2 గంటలకు నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 
 
ఈ పరీక్షను ఇంగ్లీష్, హిందీ, తెలుగు సహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ఇందుకోసం వచ్చే నెల 6వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. దేశంలో 543 నగరాలు, పట్టణాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ విభాగాల్లో 50 మార్కుల చొప్పున 200 మార్కులకు పరీక్షను నిర్వహించనుంది. 
 
ఒక్కో ప్రశ్నకు ఒక నిమిషం చొప్పున సమయాన్ని కేటాయించారు. దేశ వ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. కాగా, 2022 నుంచి నీట్ పరీక్షను రాసేందుకు విద్యార్థుల్లో గరిష్ట వయోపరిమితిని కూడా ఎత్తివేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sprit legal notice: మహిళా రైతు నిర్మాత నర్సమ్మ స్పిరిట్ చిత్రానికి ప్రభాస్ కు సంబంధం ఏమిటి?

Narne Nithin: నార్నే నితిన్ #NN5 మూవీ హ్యూమరస్ క్రియేటివ్ పోస్టర్ ద్వారా అనౌన్స్‌మెంట్

Naga Durga : ప్రియదర్శి మూవీలో హీరోయిన్ గా తెలుగు ఫోక్ సాంగ్స్ ఫేమ్ నాగదుర్గ

Suriya: విశ్వనాథ్ & సన్స్ చిత్రం తొలి గీతం నేనో బటర్‌ఫ్లై

Prabhas: మాటలు లాంటి పాటలతో తీశాం గట్టిగా చెప్పు అంటున్న ప్రభాస్

తర్వాతి కథనం
Show comments