Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెస్ట్ చిత్రంగా "కోడా" : బెస్ట్ లిడ్ యాక్టర్‌గా విల్ స్మిత్

Advertiesment
బెస్ట్ చిత్రంగా
, సోమవారం, 28 మార్చి 2022 (17:12 IST)
ఆస్కార్ అవార్డుల 94వ అకాడెమీ అవార్డుల ప్రదానోత్సవ వేడుక ఘనంగా జరుగుతున్నాయి. హాలీవుడ్ తారలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి రెజీనా హాల్, అమీ షుమర్, వాండా సైక్స్‌లు వ్యాఖ్యాతలుగా వ్యవహించారు. 
 
అయితే, ఈ కార్యక్రమంలో ఈ యేడాది ఉత్తమ నటీనటులుగా విల్ స్మిత్, జెస్సీకా ఛస్టెయిన్ ఎంపికయ్యారు. వీరిద్దరూ కూడా గతంలో అకాడెమీ అవార్డులు తృటిలో చేజార్చుకున్నారు. గతంలో విల్ స్మిత్ రెండుసార్లు, జెస్సికీ ఒకసారి అవార్డులను నామినేట్ అయినప్పటికీ అవార్డును మాత్రం అందుకోలేకపోయారు. కానీ ఈ దఫా మాత్రం వీరికి ఈ అవార్డు వరించింది. 
 
94వ ఆస్కార్ అవార్డు విజేతల వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తమ చిత్రం: 'కోడా'
బెస్ట్ లీడ్ యాక్టర్: విల్ స్మిత్ ('కింగ్ రిచర్డ్')
ఉత్తమ నటి: జెస్సికా ఛస్టెయిన్ ('ది ఐస్ ఆఫ్ టామీ ఫే')
ఉత్తమ సహాయ నటుడు: ట్రాయ్ కోట్సూర్ ('కోడా')
ఉత్తమ సహాయ నటి: అరియానా డెబోస్ ('వెస్ట్ సైడ్ స్టోరీ')
ఉత్తమ దర్శకుడు: జేన్ కాంపియన్ ('ది పవర్ ఆఫ్ ది డాగ్')
బెస్ట్ ఒరిజినల్ సాంగ్: ('నో టైమ్ టు డై') బిల్లీ ఎలిష్, ఫిన్నియాస్ ఓ’కానెల్
బెస్ట్ డాక్యుమెంటరీ: 'సమ్మర్ ఆఫ్ సోల్'
రచన (అడాప్టెడ్ స్క్రీన్ ప్లే): సియాన్ హెడర్ ('కోడా')
రచన (ఒరిజినల్ స్క్రీన్‌ప్లే): కెన్నెత్ బ్రనాగ్ ('బెల్ఫాస్ట్')
 
ఇకపోతే ఈ దపా ఉత్తమ నటుడుగా ఎంపికైన విల్ స్మిత్ విషయానికి వస్తే వేర్ ది డే టేక్స్ యూ అనే చిత్రం ద్వారా తెరంగేట్రం చేశారు. ఈయన నిర్మాతగా కూడా రాణించారు. ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాల్లో నటించిన స్మిత్... భారతీయ సినీ పరిశ్రమకు కూడా సుపరిచితులే. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' అనే బాలీవుడ్ చిత్రంలో ఆయన ఓ అతిథి పాత్రలో మెరిశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు డైరక్షన్‌లో చిత్రం ప్రారంభం