ఆ కోతి ఎంత తెలివైందో ఈ వీడియోలో చూడండి.. (Video)

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (19:13 IST)
ఆధునిక యుగం కంటే స్మార్ట్ ఫోన్ల యుగమనే ప్రస్తుత కాలాన్ని చెప్పుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ల ద్వారా సోషల్ మీడియాల ద్వారా ఎక్కడ ఏం జరిగినా అది వీడియోల రూపంలో వైరల్ అవుతున్నాయి.


ఇంటర్నెట్ వినియోగం బాగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. స్మార్ట్ ఫోన్లను ఆధారంగా చేసుకుని కొత్త యాప్‌లు వాడుకలోకి వస్తున్నాయి. ఇందులో చైనాకు చెందిన టిక్ టాక్ కూడా ఒకటి. 
 
ఈ యాప్ ద్వారా డబ్ స్మాష్‌లు, ఇతరత్రా వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా వున్న ప్రజలకు నిమిషాల్లో చేరిపోతున్నాయి. టిక్ టాక్ ద్వారా పలు వీడియోలు ఇప్పటికే వైరల్ అవుతూ వస్తున్నాయి. తాజాగా ఓ కోతికి సంబంధించిన టిక్ టాక్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ వీడియో ఓ కోతి దాహార్తిని తీర్చేందుకు నీరు తాగి కుళాయిని మూసి వేస్తుంది. ఈ వీడియోను డాక్టర్ ఎస్వై ఖురేషి, భారత మాజీ ఎన్నికల కమిషనర్ షేర్ చేశారు. ఇంకా ఈ వీడియోకు ''మానవులకు ఎంత అందమైన సందేశం!"అంటూ శీర్షిక పెట్టారు. 
 
ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా కోతికున్న తెలివిని ప్రశంసించుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకా వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు.

ఇలా సోషల్ మీడియాను ఈ వీడియో షేక్ చేస్తోంది. ప్రపంచ దేశాలను నీటి కొరత ఇబ్బందులకు గురిచేస్తున్న నేపథ్యంలో ఈ కోతి మానవులకు ఈ వీడియో ద్వారా మంచి సందేశం ఇచ్చిందని.. నీటిని పొదుపు చేయాలనే సందేశాన్ని కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చునని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకేముంది.. భారీగా వ్యూస్ కొట్టేస్తున్న ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: ఫైర్ మీదున్నా.. తర్వాతి సవాల్‌కు సిద్ధం అంటున్న రామ్ చరణ్

వార్నీ... ఆ చిత్రంపై మోహన్ బాబు ఏమీ మాట్లాడకపోయినా బిగ్ న్యూసేనా?

Sankranti movies: వినోదాన్ని నమ్ముకున్న అగ్ర, కుర్ర హీరోలు - వచ్చేఏడాదికి అదే రిపీట్ అవుతుందా?

మధిరలో కృష్ణంరాజు డయాబెటిక్ వార్షిక హెల్త్ క్యాంప్ ప్రారంభించనున్న భట్టివిక్రమార్క

Netflix: బిగ్గెస్ట్ స్టార్స్ తో 2026 లైనప్‌ను అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాన్సర్ అవగాహనకు మద్దతుగా 2026 ముంబయి మారథాన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్

పురుషుల కంటే మహిళలు చలికి వణికిపోతారు, ఎందుకని?

గుండెకి ఈ పండ్లు ఆరోగ్యం

అల్పాహారం, ఒత్తిడి, రాత్రిపూట నిద్ర... మధుమేహంతో లింక్

హైదరాబాద్‌లో తమ 25 ఏళ్ల కార్యకలాపాలను వేడుక జరుపుకున్న టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments