Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు రుణం తీర్చుకోలేను.. కానీ అది చేసి తప్పు చేశారు.. సుజనా చౌదరి

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (19:07 IST)
తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉంటూ చివరకు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు సుజనా చౌదరి. నారా లోకేష్ కారణంగానే సుజనాతో పాటు మరికొంతమంది ఎంపిలు బిజెపిలో చేరిపోయారని ప్రచారం బాగానే సాగింది. అయితే కొంతమంది ఎంపిలతో పాటు మరికొంతమంది సీనియర్ నేతలు తెలుగుదేశం పార్టీని వదిలారే గానీ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదు.
 
సుజనా చౌదరి బిజెపిలో చేరిన తరువాత కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబేనన్నారు సుజన. చంద్రబాబు చేతులు పట్టుకుని నాతో ఆప్యాయంగా మాట్లాడేవారని, నేను కూడా ఆయన చేతులు పట్టుకొని ముందుకు సాగానని.. అయితే ఆయన తీసుకున్న నిర్ణయాలు కొన్ని పార్టీలో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందన్నారు సుజనా చౌదరి.
 
చంద్రబాబు నిర్ణయాలు ఇబ్బందికరంగా ఉన్నా సరే ఎన్నికల్లో పోరాడామని, అయితే చివరకు ఓడిపోవాల్సి వచ్చిందన్నారు. ఎపికి కేంద్రం ఎలాంటి అన్యాయం చేయలేదని, తాను ఏ పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడుకు మాత్రం క్రుతజ్ఞుడేనన్నారు సుజనా చౌదరి. పార్టీ వదిలిన తరువాత చంద్రబాబు గురించి సుజనా చౌదరి మాట్లాడిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments