Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో కర్నాటక సీఎం యడియూరప్ప పూజలు....

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (18:45 IST)
కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప హైదరాబాద్‌లో చినజీయర్ స్వామిని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. గురువారం రాత్రి బెంగళూరు నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న యడ్డీ.. నేరుగా ముచ్చింతల్‌లోని చినజీయర్ ఆశ్రమానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేశారు. 
 
అనంతరం శుక్రవారం తెల్లవారుజామున శ్రీ యాగంలో కుటుంబసభ్యులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యెడ్డీ రాకపై చినజీయర్ శిష్యుడు, మైహోమ్స్ గ్రూప్ అధినేత రామేశ్వరరావు మాట్లాడుతూ.. యడియూరప్ప సీఎం అయిన సందర్భంగా చినజీయర్ ఆశీర్వాదాలు తీసుకున్నారని.. ఆశ్రమం ప్రాంగణంలో శ్రీరామచంద్రుడిని దర్శించుకున్నారని తెలిపారు.
 
కేబినెట్ విస్తరణ తర్వాత మరోసారి దర్శనానికి వస్తానని చెప్పినట్లుగా రామేశ్వరరావు వెల్లడించారు. శ్రావణమాసం ఆరంభమవుతున్న సందర్భంగా మంగళ శాసనాలు చేస్తున్నామని.. ఈ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చాయని.. శ్రావణ మాసం వస్తూ వస్తూనే వానలు తీసుకొచ్చిందని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments