మీటూ కేసులో తనుశ్రీ దత్తాకు షాక్.. నానాకు క్లీన్ చిట్.. ఆధారాల్లేవట..

Webdunia
గురువారం, 13 జూన్ 2019 (16:26 IST)
దేశాన్ని కుదిపేసిన మీటూ కేసులో త‌నుశ్రీ ద‌త్తాకు మాత్రం ఊహించ‌ని షాక్ త‌గిలింది. మీటూ ఉద్య‌మానికి ముందుగా ఆజ్యం పోసిన హీరోయిన్ త‌నుశ్రీ ద‌త్తా. నానా ప‌టేక‌ర్ లాంటి లెజెండ‌రీ యాక్ట‌ర్ మీద లైంగిక ఆరోప‌ణ‌లు చేసింది. దీంతో నానా ప‌టేక‌ర్‌పై కేసు కూడా న‌మోదైంది.
 
పదేళ్ల క్రితం 'హార్న్‌ ఓకే ప్లీజ్‌' సెట్స్‌లో త‌న‌ను నానా ప‌టేక‌ర్ లైంగికంగా వేధించాడ‌ని తనుశ్రీ దత్తా ఆరోపించింది. ఈమె త‌ర్వాత చాలా మంది ఇలాంటి కామెంట్స్ చేసారు. అయితే ఇప్పుడు నానా పటేకర్‌ తప్పు చేసాడ‌ని చెప్ప‌డానికి ఎలాంటి సాక్ష్యాలు లేవ‌ని కోర్టు తేల్చేసింది. 
 
దాంతో ఇన్నాళ్లు కోర్టులో నానిన ఈ కేసు నుంచి ఇప్పుడు విముక్తి పొందాడు నానా పటేకర్. కోర్ట్ ఈయ‌న‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇప్ప‌టికీ తనుశ్రీ ద‌త్తా కావాల‌నుకుంటే ప్రొటెస్ట్‌ రిపోర్ట్‌ను దాఖలు చేయొచ్చ‌ని.. దీనివ‌ల్ల మూసేసిన కేసును కూడా మ‌రింత లోతుగా విచార‌ణ జ‌రిపించే అవ‌కాశం ఉంటుంద‌ని ఆమె త‌ర‌ఫు లాయ‌ర్ సుజయ్‌ చెప్పారు. 
 
ఈ తీర్పుపై త‌నుశ్రీ ద‌త్తా కూడా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. కావాల‌నే నానా ప‌టేక‌ర్‌కు భ‌య‌ప‌డి కొంద‌రు సాక్ష్యం చెప్ప‌డానికి వెన‌కాడుతున్నారంటూ తనుశ్రీ మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

akhanda 2 Update: అఖండ 2 విడుదల కాకపోవటంతో ఎగ్జిబిటర్స్ చాలా నష్టపోయారు : నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం