Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగం పేరుతో వలవేసి.. కానిస్టేబుల్ కుమార్తెను రేప్ చేసిన డీసీపీ

ఉద్యోగం పేరుతో కానిస్టేబుల్ కుమార్తెపై లైంగికదాడికి పాల్పడ్డాడో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ). ఈ దారుణం మహారాష్ట్ర రాష్ట్రంలోని ఔరంగాబాద్‌లో వెలుగుచూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
శుక్రవారం, 29 జూన్ 2018 (15:21 IST)
ఉద్యోగం పేరుతో కానిస్టేబుల్ కుమార్తెపై లైంగికదాడికి పాల్పడ్డాడో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ). ఈ దారుణం మహారాష్ట్ర రాష్ట్రంలోని ఔరంగాబాద్‌లో వెలుగుచూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
మహారాష్ట్ర, ఔరంగాబాద్‌లోని ఎండీసీ పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది. ఈమెకు 23 యేళ్ల కుమార్తె ఉంది. ఈ యువతి పట్టభద్రురాలు. ఈమె డీసీపీ రాహుల్ శ్రీరామ్‌ని కలిసి తన కుమార్తెకు ఏదేని ఉద్యోగం చూసిపెట్టాలని కోరింది. ఇదే అదునుగా భావించిన ఆ కామ ఖాకీ... ఆ యువతిని తన ఇంటికి తీసుకెళ్లి తనలోని వక్రబుద్ధిని ప్రదర్శించాడు. అంతటితో ఊరుకోకుండా నెలల తరబడి ఆమెను లైంగికంగా, మానసికంగా వేధించసాగాడు. 
 
ఆ డీసీపీ వేధింపులు తారా స్థాయికి చేరడంతో ఇక భరించడం వల్ల కాదని భావించిన ధైర్యం తెచ్చుకుని జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పింది. ఇద్దరూ కలిసి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి డీసీపీ రాహుల్‌పై ఫిర్యాదు చేశారు. మహిళా కానిస్టేబుల్‌ కూతురిపైనే ఉన్నతాధికారి అకృత్యానికి పాల్పడటం మహారాష్ట్ర పోలీసు శాఖలో సంచలనం రేపింది. ఈ ఉదంతంపై ఉన్నతాధికారులు వేగంగా స్పందించారు. 
 
'బాధితురాలి ఫిర్యాదుమేరకు ప్రాధమిక దర్యాప్తు అనంతరం డీసీపీ రాహుల్‌ శ్రీరామ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశాం. ప్రస్తుతం అతను సెలవుపై వెళ్లిపోయాడు. మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించి, చార్జిషీటు దాఖలు చేస్తా'మని దర్యాప్తు అధికారి వినాయక్‌ మీడియాకు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం