Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేల్ ఫ్రెండ్స్‌తో అర్థరాత్రివరకు చాటింగ్... ఈ భార్య నాకొద్దు : విడాకులు కోరిన టెక్కీ భర్త

ఎంతో ఇష్టపడి కట్టుకున్న భార్యతో కాపురం చేయలేక ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విడాకుల కోసం కోర్టుమెట్లెక్కాడు. తన భార్య అర్థరాత్రుళ్లు కూడా మేల్ ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేస్తోందని వాపోయాడు. పైగా, రేయింబవుళ్ళూ ఇంటర

Webdunia
శుక్రవారం, 29 జూన్ 2018 (14:15 IST)
ఎంతో ఇష్టపడి కట్టుకున్న భార్యతో కాపురం చేయలేక ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విడాకుల కోసం కోర్టుమెట్లెక్కాడు. తన భార్య అర్థరాత్రుళ్లు కూడా మేల్ ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేస్తోందని వాపోయాడు. పైగా, రేయింబవుళ్ళూ ఇంటర్నెట్‌లోనే గడుపుతోందని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఢిల్లీకి చెందిన నరేంద్ర సింగ్‌(30) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. గతేడాది ఓ యువతిని ఇష్టపడి పెళ్లిచేసుకున్నాడు. అయితే పెళ్లైన రోజునుంచీ భార్య ఇంటర్నెట్‌‌లోనే గడుపుతుండటాన్ని గమనించాడు. అయితే, కొన్ని రోజులకు మార్పు వస్తుందని భావించాడు. కానీ ఆమెలో మార్పురాకపోగా ఏకంగా అర్థరాత్రి వరకు మేల్ ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేయసాగింది. దీంతో ఇలాంటి పనులు మానుకోవాలని తనను, తన కుటుంబ బాధ్యతలు షేర్‌ చేసుకోవాలని కోరాడు. ఆమె ఆ పని చేయకపోగా అతనిపై ఎదురుతిరిగి గొడవ చేసింది. దీంతో నరేంద్ర సింగ్ విడాకులు కోరుతు ఢిల్లీ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు.
 
ఈపిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు ఆ దంపతులిద్దరినీ వచ్చే నెలలో కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది. పెళ్లయ్యాక అత్తవారింటి వాతావరణానికి తగ్గట్లుగా మారే అవకాశం టెక్కీ ఇవ్వలేదని, తన క్లైయింట్‌పై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఇంజినీర్‌ భార్య తరరు న్యాయవాది తెలిపారు. అయితే, ప్రస్తుతం సోషల్‌ మీడియాలాంటి వాటి వల్ల దంపతులు విడాకులు కోరడం ఆందోళన కలిగించే విషయమని ఢిల్లీ హైకోర్టు జస్టిస్‌ హిమా కోహ్లీ వ్యాఖ్యానించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments