Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్.. నగ్న వీడియో చూసేందుకు జనం ఎగబడుతున్నారట..

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (14:55 IST)
కరోనా వైరస్ కారణంగా ఇంటి పట్టునే వుండే వారి సంఖ్య పెరిగిపోతోంది. అలా స్మార్ట్ ఫోన్లు చూస్తూ గంటల పాటు గడిపే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా లాక్ డౌన్ పుణ్యమా అని.. నగ్న వీడియోలు చూడడానికి ఎగబడుతున్నారు జనాలు.. దీన్నే ఆసరాగా చేసుకొని కొందరు మోసాలు చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటన జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే... ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు పరిచయమైన కిలాడీ యువతి నగ్న చిత్రాలు చూపించి బెదిరించి రూ.3.63 లక్షలు బదిలీ చేయించుకుంది. ఆమె బెదిరింపులు భరించలేక బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేయగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఐటీ కారిడార్‌లో విధులు నిర్వహిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు కొద్దిరోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఓ యువతి పరిచయమైంది. ఫొటోలు పరస్పరం మార్పిడి చేసుకున్నాక ఒకరోజు కిలేడి నగ్న వీడియోను పంపించింది. 
 
సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను కూడా పంపమని కోరగా.. అతడు కూడా తన నగ్న వీడియోను పంపించాడు. అప్పటి నుంచి ఆ యువతి.. అతని నగ్న వీడియోను అతని కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సంస్థ ఉద్యోగులకు పంపుతానంటూ బెదిరించి వారం రోజుల్లోనే రూ.3.63 లక్షలు తన బ్యాంకు ఖాతాలో జమ చేయించుకుంది. అదనంగా మరో రూ.10 లక్షలు డిమాండ్‌ చేయడంతో ఆమె వేధింపులు భరించలేని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పోలీసులను ఆశ్రయించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments