Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెస్ట్ క్యాన్సర్‌ను పసిగట్టే బ్రా: కేరళ సైంటిస్ట్‌కు నారీశక్తి అవార్డు..

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (13:05 IST)
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేరళ సైంటిస్ట్ నారీ శక్తి పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్‌ను పసిగట్టే బ్రాను కనుగొన్న ఆమెకు ఈ అవార్డు లభించింది. వివరాల్లోకి వెళితే.. కేరళ సైంటిస్ట్ డాక్టర్. ఎ. సీమా ఈ అవార్డును తన ఖాతాలో వేసుకున్నారు. సెన్సార్ అటాచ్డ్ బ్రాజర్‌ను కనుగొన్నారు. దీని సాయంతో బ్రెస్ట్ క్యాన్సర్‌ను పసిగట్టవచ్చు. 
 
త్రిసూర్‌లోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీలో ఆమె సైంటిస్టుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత మహిళా పురస్కారమైన నారీ శక్తి అవార్డును ఆమె అందుకున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అవార్డు కింద లక్ష రూపాయలను రాష్ట్రపతి రామ్ నాథ్ గోవింద్ ఆమెకు అందజేశారు. 
 
శరీర ఉష్ణోగ్రత ఆధారంగా సెన్సార్ టచ్‌తో కూడా ఈ బ్రా.. బ్రెస్ట్ క్యాన్సర్‌ను ముందుగానే పసిగట్టేస్తుంది. ఈ సెన్సార్ సైజ్ 1ఎమ్ఎమ్ లెంగ్త్‌, 1ఎమ్ఎమ్ విడ్త్, 1.5ఎమ్ఎమ్ డీప్‌ను కలిగివుంటుంది. దీన్ని సిస్టమ్‌కు కనెక్ట్ చేయడం ద్వారా 2డీ పిక్చర్ల ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్‌ను ముందుగానే పసిగట్టే వీలుంటుంది. ఈ బ్రాలను ధరించిన 15 నుంచి 30 నిమిషాల్లోపు బ్రెస్ట్ క్యాన్సర్‌ వుందా లేదా అనేది తేలిపోతుంది. 
 
ఈ బ్రాలు రూ.200 నుంచి రూ.500ల వరకు పలుకుతున్నాయని సీమా వెల్లడించారు. ఇప్పటివరకు 117 మంది రోగులను ఈ బ్రా ద్వారా పరిశోధించడం జరిగిందని.. మలబార్ క్యాన్సర్ సెంటర్ ఈ పరీక్షల్లో విజయం సాధించిందని చెప్పుకొచ్చారు. అయితే ఈ బ్రాలను ధరించడం ద్వారా రేడియేషన్, ప్రైవసీ భయం అక్కర్లేదని.. ఇంకా ఎలాంటి నొప్పి వుండదని సీమా వెల్లడించారు. 
 
ఈ బ్రాను రూపొందించడం ద్వారా సీమా నారీ శక్తి అవార్డును గెలుచుకోవడంతో పాటు అంతకుముందు ఆమె సైన్స్ ద్వారా మహిళల కోసం ఉపయోగపడే పరికరాలను కనుగొన్న కారణంగా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం రూ.5లక్షల నగదుతో సత్కరించింది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments