Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరులో కేసీఆర్... వెంట ప్రకాష్ రాజ్.. తెరాసలో చేరినట్టేనా?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బెంగుళూరుకు వెళ్లారు. ఆయన హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు ప్రత్యేక విమానంలో వెళ్లారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న తరుణంలో కేసీఆర్ బెంగుళూరు పర్

Webdunia
శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (13:07 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బెంగుళూరుకు వెళ్లారు. ఆయన హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు ప్రత్యేక విమానంలో వెళ్లారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న తరుణంలో కేసీఆర్ బెంగుళూరు పర్యటన ఆసక్తిని రేపుతోంది.
 
ముఖ్యంగా, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన నడుంబిగించారు. ఇందులోభాగంగా, బెంగుళూరుకు శుక్రవారం వెళ్ళి, మాజీ ప్రధానమంత్రి, జనతాదళ్ (ఎస్) అధినేత దేవెగౌడతో భేటీ అయ్యారు. 
 
ఈ భేటీ బెంగళూరులోని దేవెగౌడ నివాసం అమోఘలో జరుగింది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై ఇద్దరు నేతలు చర్చించినట్టు సమాచారం. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన ఫ్రంట్‌పై ఆసక్తిగా ఉన్న పార్టీల అధినేతలతో సమావేశమవుతున్నారు. 
 
మరోవైపు, బెంగుళూరుకు వెళ్లిన కేసీఆర్ వెంట పార్టీ నేతలు లేకపోగా, సినీ నటుడు ప్రకాష్ రాజ్ మాత్రమే ఉన్నారు. దీంతో ఆయన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస పార్టీలో చేరినట్టేననే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రకాష్ రాజ్ ఇప్పటికే తెలంగాణాలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్న విషయం తెల్సిందే. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments