Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడా... గుడిలోనే 8 యేళ్ల బాలికపై 7 రోజులు లైంగికదాడి...

దేశంలో మహిళలే కాదు.. ఏమీ తెలియని బాలికల మానప్రాణాలకు కూడా రక్షణ కరవైంది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో 8యేళ్ల బాలికను ఏడు రోజులు పాటు ఓ ఆలయంలో బంధించి పాశవికంగా లైంగికదాడి చేశారు. ఈ దారుణం ఆలస్యంగా వెలుగు

Webdunia
శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (12:24 IST)
దేశంలో మహిళలే కాదు.. ఏమీ తెలియని బాలికల మానప్రాణాలకు కూడా రక్షణ కరవైంది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో 8యేళ్ల బాలికను ఏడు రోజులు పాటు ఓ ఆలయంలో బంధించి పాశవికంగా లైంగికదాడి చేశారు. ఈ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే....
 
కతువాలో మైనారిటీలుగా ఉన్న బఖర్‌వాల్ సంచారజాతివారిని వెళ్లగొట్టేందుకు కొందరు అక్కడి ఆలయ సంరక్షుడి ఆధ్వర్యంలో ఆసిఫా బానో (8)ను అపహరించి ఓ గ్రామంలో వారం రోజులపాటు నిర్బంధించి, మత్తుమందు ఇచ్చి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారు. 
 
చివరికి ఆ బాలికను గొంతు పిసికి చంపి, ప్రాణం పోయిందని నిర్ధారించుకోవడానికి పెద్ద బండరాయితో రెండుసార్లు బాదారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిచడంతో దర్యాప్తు బృందం సిట్ 8 మంది నిందితులను అరెస్టు చేసింది. అరెస్టు అయిన వారిలో ఇద్దరు పోలీసు అధికారులు, ఒక హెడ్‌కానిస్టేబుల్ ఉండటం గమనార్హం. 
 
సాక్ష్యాలను నాశనం చేయడంతో పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కతువాలో ఎనిమిదేండ్ల చిన్నారిపై జరిగిన సామూహిక లైంగికదాడితో మనం మనుష్యులుగా విఫలమయ్యాయని విదేశీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ట్వీట్ చేశారు. 
 
దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నమ్మశక్యం కానటువంటి క్రూరత్వం, దుండగులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. అటువంటి వారిని కాపాడటానికి ప్రయత్నాలు జరుగడం విస్మయం కలిగిస్తుంది. దుండగులను శిక్షించకుండా వదిలిపెట్టవద్దు అని ట్వీట్ చేశారు. చిన్నారిపై దాడి మానవత్వంపై దాడి వంటిదని ఆయన తన ట్వీట్‌‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అక్కినేని ఫ్యామిలీలో వరుస వివాహ వేడుకలు... ముమ్మరంగా ఏర్పాట్లు!!

దివ్యప్రభ న్యూడ్ వీడియో... సోషల్ మీడియాలో వైరల్... పాపులారిటీ కోసమేనా (Video)

తుదిదశలో 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' షూటింగ్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం